సొరచేప నోటి కాడి ఫుడ్ లాగేసిన మనుషులు.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..?

కాలం గడుస్తున్న కొద్దీ మనుషులు ఈ భూ ప్రపంచంపై ఉన్న అన్ని అడవులు, సముద్రాలు లాంటి ప్రకృతి ప్రాంతాలను ఆక్రమించుకుంటూ పోతున్నారు.దీంతో మనుషులకు జంతువులకు మధ్య ఘర్షణలు పెరిగిపోతున్నాయి.

 Fishermen Fighting With Shark Over Tuna Video Viral Details, Humans, Natural Hab-TeluguStop.com

నిజం చెప్పాలంటే జంతువుల ప్లేసుల్లోకి మనుషులు చొరబడుతున్నారు.వాటికి నివాసం లేకుండా చేయడంతో పాటు ఆహారం దొరక్కుండా చేస్తున్నారు.

తాజాగా కొంతమంది మనుషులు ఒక చేపను షార్క్‌( Shark ) నోటి నుంచి లాక్కోవడానికి ట్రై చేశారు.ఈ షాకింగ్ ఘటనను వీడియో రికార్డు కూడా చేశారు.

అది చూసి చాలా మంది షాక్ అవుతున్నారు.

ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన కొద్ది సేపటికే చాలా మంది దీన్ని చూశారు.

ఇది ఒక పెద్ద వివాదానికి దారి తీసింది.ఒక జంతువు తన ఆహారాన్ని తింటున్నప్పుడు దాన్ని అంతరాయం కలిగించడం సరైనదా? మనం జంతువుల జీవితాలపై ఎంత ప్రభావం చూపుతున్నాం? అని చాలా మంది చర్చించుకున్నారు.ఈ సంఘటన అమెరికాలోని శాన్‌డియాగో( San Diego ) సముద్రం దగ్గర జరిగిందని డైలీ మెయిల్ అనే పత్రిక చెప్పింది.

డైలీ మెయిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ఈ సంఘటన స్పష్టంగా కనిపిస్తుంది.ఈ వీడియోలో ఒక పెద్ద ట్యూనా చేపను( Tuna Fish ) ఒక మకో షార్క్ పట్టుకున్న తీరు చూపించారు.చేపను షార్క్ నోటి నుంచి లాక్కోవడానికి మత్స్యకారులు ప్రయత్నిస్తున్నారు.

కొంతమంది పడవ అంచున వంగి చేపను లాగడానికి ప్రయత్నిస్తుంటే, మరికొందరు వారికి సహాయం చేస్తున్నారు.ఇలా కొన్ని క్షణాలు టుగ్-ఆఫ్-వార్ జరిగిన తర్వాత, మత్స్యకారులు( Fishermen ) చేపను షార్క్ నుంచి లాక్కోవడంలో విజయం సాధించారు.

చివరకు షార్క్ అక్కడి నుంచి చాలా బాధగా వెళ్లిపోయింది.ఈ దృశ్యం చూశాక కళ్ల వెంట నీళ్లు తిరిగాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

“శాన్ డియాగో సమీపంలోని ఫిషింగ్ బోట్ సిబ్బంది బలమైన మాకో షార్క్‌తో తీవ్ర పోరాటం చేశారు.షార్క్ వారి నుంచి పెద్ద ట్యూనాను దొంగిలించడానికి ప్రయత్నిస్తోంది.” అని దీనికి ఒక క్యాప్షన్ జోడించారు.

మత్స్యకారులు చేపను దొంగిలించడంపై ప్రజలు చాలా కోపంగా ఉన్నారు.

షార్క్ పట్టుకున్న ఆహారాన్ని మనుషులు తీసుకోవడం చాలా తప్పు అని అంటున్నారు.షార్క్‌ను ప్రశాంతంగా ఆహారం తిననివ్వాలని, అది వాటి సొంత ప్రాంతం అని చెప్తున్నారు.

కొంతమంది మత్స్యకారుల ప్రవర్తన చాలా చెడ్డది అని, వాళ్లపై జరిమానా విధించాలని కూడా అంటున్నారు.షార్క్‌లు ఆకలితో ఉన్నప్పుడు వాటి ఆహారాన్ని తీసుకున్నందుకే మనుషులపై దాడి చేస్తుంటాయని కొందరు చెప్పారు.

మనుషులు చాలా అత్యాశపరులు అని, ప్రకృతి నియమాలను గౌరవించాలని ఒకరు కామెంట్ పెట్టారు.కొంతమంది మత్స్యకారుల బోటు మునిగిపోవాలని కూడా కోరుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube