ఎస్వీ కృష్ణారెడ్డిని టార్చర్ చేసిన రాజేంద్రప్రసాద్.. దాంతో అతనే నష్టపోయాడు..??

నట కిరీటి రాజేంద్రప్రసాద్ ( Rajendra Prasad )మాయలోడు, ఆ ఒక్కటీ అడక్కు, ఏప్రిల్ ఒకటి విడుదల, ఎదురింటి పెళ్ళాం పక్కింటి మొగుడు వంటి ఎన్నో కామెడీ చిత్రాలు తీశాడు.ఈ సినిమాలతో కామెడీకి కేరాఫ్ అడ్రస్ అయ్యాడు.

 Rajendra Prasad Torture To Sv Krishna Reddy, Sv Krishna Reddy , Rajendra Prasad-TeluguStop.com

ఆనలుగురు, కాష్మోరా లాంటి సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి షాకిచ్చాడు.ఇప్పటికీ రాజేంద్రప్రసాద్ తెలుగు సినిమాల్లో కంటిన్యూ అవుతూనే ఉన్నాడు.

కాకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్నాడు.అయితే ఎప్పుడూ ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే ఈ నటుడు ఒకానొక సమయంలో ఎస్వీ కృష్ణారెడ్డిని మాత్రం బాగా ఏడిపించేసాడు.

డైరెక్టర్ కృష్ణారెడ్డి( Director Krishna Reddy ) గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.మాయలోడు, యమలీల, శుభలగ్నం, మావిచిగురు, పెళ్ళాం ఊరెళితే వంటి ఎన్నో మంచి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా అలరించాడు.

రాజేంద్రప్రసాద్‌తో కలిసి మాయలోడితోపాటు రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా తీశాడు.దాని తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఏ మూవీ కూడా రాలేదు.నిజానికి రాజేంద్రప్రసాద్ సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న సమయంలో కృష్ణారెడ్డి కూడా మంచి సినిమాలు తీశాడు.కానీ ఈ హీరోతో కలిసి ఎక్కువగా సినిమాలు చేయలేదు.

దానికి రాజేంద్రప్రసాద్ చేసిన ఒక తప్పే కారణం.

Telugu Adurintipellam, Krishna Reddy, Rajendra Prasad, Rajendraprasad, Tollywood

మాయలోడు సినిమా తీస్తున్న సమయంలో రాజేంద్రప్రసాద్ కృష్ణారెడ్డితో గొడవపడ్డాడు.తన వల్లే సినిమాలు హిట్ అవుతాయని అన్నాడు.తర్వాత సౌందర్యతో ఒక పాట షూటింగ్ చేయడానికి ఒప్పుకోలేదు.

అంతేకాదు తన పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి కొంత సమయం మాత్రమే కేటాయిస్తానని మొండిగా ప్రవర్తించాడు.అయితే కృష్ణారెడ్డి రాజేంద్రప్రసాద్ ని ఎలాగోలా బతిలాడి డబ్బింగ్ చెప్పించుకున్నాడు.

“చినుకు చినుకు అందెలతో” సాంగ్ షూటింగ్ ను రాజేంద్ర ప్రసాద్‌కి బదులుగా బాబు మోహన్ తో కంప్లీట్ చేశాడు.ఆ తర్వాత రాజేంద్రప్రసాద్ తో సినిమా చేయడానికి అసలు ఇష్టపడలేదు.

Telugu Adurintipellam, Krishna Reddy, Rajendra Prasad, Rajendraprasad, Tollywood

జగపతిబాబు, శ్రీకాంత్ లాంటి మీడియం రేంజ్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటూ వెళ్ళాడు.రాజేంద్రప్రసాద్ గొడవ పెట్టుకోకపోయి ఉంటే ఆ హిట్స్ అన్నీ ఇతనికి ఖాతాలోనే పడి ఉంటాయి.కానీ గర్వానికి పోయి ఈ హీరో బాగా నష్టపోయాడు.అతడి మెంటాలిటీ ఇలా ఉంటుందని చాలా మంది డిసప్పాయింట్ కూడా అవుతున్నారు.ఏదేమైనా రాజేంద్రప్రసాద్ నటనకు తిరుగులేదు.కానీ దర్శకులను టార్చర్ చేయడం ఏమాత్రము అంగీకరించదగినది కాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube