జ్యోతిక, శోభన, సౌందర్య పనికి రారు.. ఆ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించిన వాణిశ్రీ..?

అలనాటి సినీ తార, కళాభినేత్రి వాణిశ్రీ ( Kalabhinetri Vanishree )40 ఏళ్ల సినీ కెరీర్‌లో అనేక విభిన్నమైన పాత్రలు పోషించింది.వాటిలో చెప్పుకోదగిన పాత్రలు ఎన్నో ఉన్నాయి.

 Vanisri Domonation In Krishnaveni Movie , Krishnaveni Movie, Kalabhinetri Vanis-TeluguStop.com

ఈ కాలంలో ఒక హీరోయిన్ ఒకే సినిమాలో డిఫరెంట్ రోల్స్ చేస్తే ఆహా, అమోఘం చాలా బాగా చేసింది అని ప్రేక్షకులు పొగుడుతుంటారు.నిజానికి వీరందరి కంటే ముందే ఓ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ రోల్ అద్భుతంగా పోషించి చూపించింది వాణిశ్రీ.1974లో వచ్చిన “కృష్ణవేణి” సినిమాలో ( Krishnaveni )వాణిశ్రీ అలాంటి పాత్ర చేసింది.ఈ రోల్‌ చేయడం అంత ఈజీ ఏం కాదు.

చంద్రముఖిలో జ్యోతిక ఎలా డిఫరెంట్ క్యారెక్టర్స్ లోకి షిఫ్ట్ అయిందో అలా వాణిశ్రీ క్యారెక్టర్ కూడా షిఫ్ట్ అవుతుంది.

జ్యోతిక నటనకు వంక పెట్టలేము కానీ వాణిశ్రీ మోస్ట్ చాలెంజింగ్ రోల్‌లో ఆమె కంటే మంచిగా నటించి వావ్ అనిపించింది.

హెల్యూసినేషన్స్ వస్తే ఒక మానసిక రోగి ఎలా ప్రవర్తిస్తారో అచ్చం అలాగే ప్రవర్తించింది.సింపుల్‌గా చెప్పాలంటే ఆమె నట విరాట రూపాన్ని చూపించింది.

కృష్ణం రాజు, వాణిశ్రీ నటించిన ఈ సినిమాకు వి.మధుసూధనరావు( V.Madhusudhana Rao ) దర్శకత్వం వహించారు.కృష్ణంరాజు ఈ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరించాడు.

Telugu Amaravati, Jyotika, Krishnaveni, Nagarjuna Sagar, Sobhana, Soundarya, Sri

ఈ తెలుగు సినిమా కన్నడంలో సూపర్ హిట్ అయిన శరపంజరకు రీమేక్.శరపంజర కర్నాటకలోని మూడు సెంటర్లలో 365 రోజులపాటు ఆడింది.ఒరిజినల్ సినిమాలో హీరోయిన్ కల్పన.ఆమెకు చాలా అవార్డులు వచ్చాయి.కానీ వాణిశ్రీ నటన ముందు ఆమె నటన తేలిపోతుంది.ఈ కన్నడ సినిమా త్రివేణి అనే రచయిత రాసిన నవల ఆధారంగా రూపొందించారు.

తెలుగు సినిమా కృష్ణానది నేపథ్యంలో సాగుతుంది.అందుకే దానికి కృష్ణవేణి అని పేరు పెట్టినట్లు ఉన్నారు.

ఈ సినిమాలో కృష్ణానది నేపథ్యంలో ఒక పాట కూడా ఉంటుంది.ఈ మూవీలోని ఇతర సన్నివేశాలను శ్రీశైలం , నాగార్జున సాగర్ , అమరావతి ప్రాంతాల్లో తీశారు.

Telugu Amaravati, Jyotika, Krishnaveni, Nagarjuna Sagar, Sobhana, Soundarya, Sri

వాణిశ్రీ నటన తర్వాత ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ మ్యూజిక్.దీనిని విజయభాస్కర్ కంపోజ్ చేశాడు.“కృష్ణవేణి తెలుగింటి విరిబోణి” పాటలో వాణిశ్రీ చాలా అందంగా కనిపించింది.పాట లిరిక్స్ కూడా అద్భుతంగా ఉంటుంది.

ఇక టేకింగ్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు.వాణిశ్రీ చీర కట్టిన విధానం, మోచేతుల కిందకు జాకెట్ వేసుకోవడం అప్పట్లో ఒక కొత్త ఫ్యాషన్ ట్రెండును ప్రారంభించాయి.

ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్ కి వచ్చి ఎన్టీఆర్ ఒక బహుమతి కూడా ప్రధానం చేశారు.మహిళలు మెచ్చిన సినిమా ఇది.యూట్యూబ్‌లో ఉంది, చూడవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube