కాళేశ్వరం ప్రాజెక్టు( Kaleshwaram Project ) వ్యవహారంపై విచారణ చేస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Minister Uttam Kumar Reddy) కలిశారు.కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ ప్రారంభించామని ఆయన చెప్పారని తెలిపారు.
విచారణలో భాగంగా ప్రభుత్వం నుంచి ఏ రకమైన సమాచారం, సహాయం కావాలన్నా సిద్ధంగా ఉన్నామని తెలిపామని మంత్రి ఉత్తమ్ కుమార్ పేర్కొన్నారు.నాలుగైదు రోజుల్లో ఎన్డీఎస్ఏ( NDSA ) నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక ఇస్తుందన్నారు.ఈ నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు చేపడుతామని స్పష్టం చేశారు.అవకాశం ఉంటే రిపేర్లు చేసి వచ్చే సీజన్ కి డ్యామ్ ను ఉపయోగంలోకి తేవాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
కేవలం రిపోర్డ్ ఆధారంగానే కాళేశ్వరం పనులకు సంబంధించిన నిర్ణయం ఉంటుందని వెల్లడించారు.