ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul gandhi )కి ఎన్నికల కమీషన్ నోటీసులు జారీ చేసింది.ఈ మేరకు ఇరువురు నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఈసీ నోటీసుల్లో పేర్కొంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ, రాహుల్ గాంధీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఈసీ నోటీసులు ఇచ్చింది.ఈ నేపథ్యంలోనే ఈ నెల 29వ తేదీ ఉదయం 11 గంటల లోపు ఎన్నికల కోడ్( Election Code ) ఉల్లంఘిస్తూ చేసిన ప్రసంగాలపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ వ్యవహరంలో బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులు వివరణ ఇవ్వాలని కోరిందని సమాచారం.ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించకుండా పార్టీ అధ్యక్షులే జాగ్రత్త వహించాలని ఈసీ పేర్కొంది.అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారితో పాటు స్టార్ క్యాంపెయినర్ ల ప్రవర్తనపై సూచనలు ఇవ్వాలని సూచించింది.