ప్రధాని మోదీ, రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు
TeluguStop.com
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi )కి ఎన్నికల కమీషన్ నోటీసులు జారీ చేసింది.
ఈ మేరకు ఇరువురు నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఈసీ నోటీసుల్లో పేర్కొంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ, రాహుల్ గాంధీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఈసీ నోటీసులు ఇచ్చింది.
ఈ నేపథ్యంలోనే ఈ నెల 29వ తేదీ ఉదయం 11 గంటల లోపు ఎన్నికల కోడ్( Election Code ) ఉల్లంఘిస్తూ చేసిన ప్రసంగాలపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ వ్యవహరంలో బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులు వివరణ ఇవ్వాలని కోరిందని సమాచారం.ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించకుండా పార్టీ అధ్యక్షులే జాగ్రత్త వహించాలని ఈసీ పేర్కొంది.
అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారితో పాటు స్టార్ క్యాంపెయినర్ ల ప్రవర్తనపై సూచనలు ఇవ్వాలని సూచించింది.
దూరం పెట్టారంటూ ప్రముఖ కోలీవుడ్ నటి ఖుష్బూ ఆవేదన.. అసలేం జరిగిందంటే?