తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత..!

తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం( Tirupati Sub Collector Office ) దగ్గర ఉద్రిక్తత నెలకొంది.నామినేషన్ దాఖలు చేసేందుకు వైసీపీ, టీడీపీ అభ్యర్థులు కార్యాలయం వద్దకు ఒకే సమయానికి చేరుకున్నారు.

 Tension Near Tirupati Sub Collector Office Details, High Tension, Nomination Pro-TeluguStop.com

వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి,( Chevireddy Mohith Reddy ) టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని( Pulivarthi Nani ) వచ్చారు.వీరితో రెండు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు.

ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు ఆఫీస్ ఆవరణలోకి వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో పోలీసులకు, టీడీపీ క్యాడర్( TDP Cadre ) మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.ఈ క్రమంలోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు స్వల్ప లాఠీఛార్జ్ చేశారని తెలుస్తోంది.మరోవైపు నామినేషన్ పత్రాలు సమర్పించి బయటకు వచ్చిన వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి వాహనంలపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.

దీంతో సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube