బొప్పాయి పంటను బూజు తెగుళ్ల నుండి సంరక్షించే యాజమాన్య పద్ధతులు..!

బొప్పాయి పంటలో( Papaya Crop ) విటమిన్లు, మినరల్స్, పొటాషియం లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.బొప్పాయి చెట్లు చాలా వేగంగా పెరుగుతాయి.

 How To Prevent Powdery Mildew In Papaya Crop Details, Powdery Mildew ,papaya Cr-TeluguStop.com

బొప్పాయి పండ్లు ఓవల్ లేదా పియర్ ఆకారంలో ఉంటాయి.

బొప్పాయి పంట సాగుకు ఇసుక నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.నేల యొక్క పీహెచ్ విలువ 6.0-6.5 మధ్యన ఉంటే పంటకు చాలా అనుకూలంగా ఉంటుంది.అధిక వర్షపాతం ఉండే ప్రాంతాల్లో, మురుగునీటి వ్యవస్థ సరిగ్గా లేని పొలంలో మొక్కలు చనిపోయే అవకాశం చాలా ఎక్కువ.

బొప్పాయి పంట సాగుకు మంచినీటి పారుదల, అధిక సారవంతమైన నేల చాలా అనుకూలం.బొప్పాయి పంటకు 25 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత చాలా అనుకూలం.

బొప్పాయి చెట్లకు( Papaya Trees ) నేల నుంచి వివిధ రకాల శిలీంద్రాలు ఆశించకుండా ఉండాలంటే.బొప్పాయి విత్తనాలను ముందుగా విత్తన శుద్ధి( Seeds Purification ) చేయడం మంచిది.ఒక లీటరు నీటిలో 1.25 మిల్లీలీటర్ల గిబ్బరెల్లిక్ యాసిడ్ కలిపి అందులో బొప్పాయి విత్తనాలను విత్తన శుద్ధి చేయాలి.జూన్ నుండి సెప్టెంబర్ వరకు బొప్పాయి పంట నాటుకోవడానికి చాలా అనుకూలమైన సమయం.సుమారుగా 45 నుంచి 60 రోజుల మధ్య వయసు ఉండే మొక్కలను ప్రధాన పొలంలో నాటుకోవాలి.

మొక్కల మధ్య మొక్కల వరుసల మధ్య అధిక దూరం ఉండేటట్లు నాటుకుంటే ఆరోగ్యకరంగా పెరుగుతాయి.

బొప్పాయి పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగుళ్ల విషయానికి వస్తే బూజు తెగుళ్లు( Powdery Mildew ) కీలక పాత్ర పోషిస్తాయి.బొప్పాయి మొక్క ఆకుపై, బొప్పాయి పండు పై తెల్లటి లేదంటే బూడిద రంగు బూజు లాంటి ఆకారం కనిపిస్తే ఆ మొక్కకు బూజు తెగుళ్లు సోకినట్టే.ఈ తెగుళ్ల నివారణ కోసం ఒక లీటర్ నీటిలో రెండు మిల్లీ లీటర్ల కాంటాఫ్ ప్లస్ శిలీంద్ర సంహారిణి కలిపి మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube