డ్రిప్ విధానం ద్వారా ఎరువులు అందిస్తే పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..!

మొక్కలకు డ్రిప్ విధానం( Drip method ) ద్వారా నీటిని, ఎరువులను అందించడం వల్ల మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతాయి.పైగా ఈ విధానం ద్వారా శ్రమ తగ్గడంతో పాటు దాదాపుగా కలుపు సమస్య( Weed problem ) ఉండదు.

 These Are The Precautions To Be Followed If Fertilizers Are Given Through Drip S-TeluguStop.com

అయితే కొంతమందికి ఫెర్టిగేషన్ పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల డ్రిప్ పరికరాలు దెబ్బతిని, మన్నిక తగ్గిపోతోంది.కాబట్టి రైతులు ముందుగా డ్రిప్ విధానం ద్వారా నీటిని, ఎరువులను అందించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

నేల ఉపరితలం మీద, నేల దిగువన, వేరు మండలంలో అతి స్వల్ప పరిమాణంలో గంటకు ఒకటి నుండి 12 లీటర్ల వరకు నీటిని అందించే విధానాన్ని డ్రిప్ పద్ధతి అంటారు.డ్రిప్ విధానం ద్వారా నీటిలో కరిగే ఎరువులను పర్టిగేషన్ పద్ధతిలో పంటకు అందించాలి.

ఒక డ్రమ్ములో కావాల్సిన మోతాదులో నీటిలో కరిగే ఎరువులను కలిపి, ఫర్టిలైజర్ ట్యాంక్ లేదంటే వెంచూరి పంప్( Venturi pump ) తో నేరుగా నీటితోపాటు ఎరువును మొక్కలకు అందించే విధానాన్ని సాల్యుబుల్ ఫర్టిలైజర్ అంటారు.

Telugu Agriculture, Drip System, Fertilizersdrip, Venturi Pump, Weed Problem-Lat

నీటితోపాటు నీటిలో కరిగే ఎరువులను అందించడం వల్ల ఎరువు భూమిలోకి ఇంకిపోయి నేరుగా వేరు వ్యవస్థకు త్వరగా అందుతుంది.సాధారణ పద్ధతిలో కంటే ఎరువు వినియోగం రెండింతలు పెరుగుతుంది.మొక్కకు కావలసిన అన్ని పోషకాలు సంపూర్ణంగా అందుతాయి.

దీంతో మొక్కలు ఆరోగ్యకరంగా పెరిగి మంచి దిగుబడులు పొందవచ్చు.

Telugu Agriculture, Drip System, Fertilizersdrip, Venturi Pump, Weed Problem-Lat

ఉద్యానవన తోటలకు డ్రిప్ విధానం ద్వారా ముందుగా నీటిని అందించాలి.నీటి ప్రవాహం సక్రమంగా ఉంటే ఆ తర్వాత నీటిలో కరిగే ఎరువులను అందించాలి.దీనివల్ల తడిగా ఉన్న భూమి నుంచి ఎరువు నీరు మొక్క వేరు వ్యవస్థకు త్వరగా చేరుతుంది.

అయితే ప్రధాన పోషకాలను, సూక్ష్మ పోషకాలను కల్పకుండా వేరువేరుగా అందించాలి.డ్రిప్ లెటరల్స్ పనితీరును తరచూ గమనిస్తూ, నీటి విడుదలకు అవరోధం లేకుండా చూసుకుంటే పంట ఆరోగ్యకరంగా పెరుగుతుంది.

డ్రిప్ ద్వారా ఎరువులను అందించేటప్పుడు ప్రెషర్ గేజ్ లో సరైన ప్రెషర్ ఉండేటట్లు చూసుకోవాలి లేదంటే ఎరువు అంతా వృధా అవుతుంది.డ్రిప్ ద్వారా దాదాపుగా 50% వరకు నీరు ఆదా అవడంతో పాటు సమర్థ ఎరువుల వినియోగ ఖర్చు తగ్గడంతో పాటు దాదాపుగా కలుపు సమస్య కూడా ఉండదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube