సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi )కి కోపం రాదనే సంగతి తెలిసిందే.ఎవరైనా తప్పు చేసినా చిరంజీవి సున్నితంగానే హెచ్చరిస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.46 సంవత్సరాల సినీ ప్రయాణంలో చిరంజీవి ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు.చిరంజీవి ఎవరినైనా కొట్టానని చెప్పినా ఎవరూ నమ్మరు.
అయితే తాజాగా ఒక సందర్భంలో చిరంజీవి తాను నాగబాబును కొట్టానని చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.నేను ఇంటర్ చదువుకునే రోజుల్లో నాగబాబు( Nagababu ) ఏడో తరగతి చదువుతున్నాడని ఆ సమయంలో అమ్మకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను సహాయం చేసేవాడినని చిరంజీవి అన్నారు.
ఇంటికి సంబంధించిన పనులన్నీ నేనే చూసుకునేవాడినని ఆయన పేర్కొన్నారు.ఒకరోజు లాండ్రీ నుంచి బట్టలు తీసుకొచ్చే పనితో పాటు మరో పని చేయాల్సిన బాధ్యత నాపై పడిందని ఆయన అన్నారు.
నేను ఇంకో పని చేసుకొని వస్తానని లాండ్రీకి వెళ్లి బట్టలు తీసుకొనిరావాలని నాగబాబుకు చెప్పానని మెగాస్టార్( Megastar ) కామెంట్లు చేశారు.నేను చేయాల్సిన పనిని పూర్తి చేసుకుని బట్టలు తెచ్చావా అని నాగబాబును అడిగితే తీసుకొనిరాలేదని నిద్రపోతున్నానని చెప్పాడని చిరంజీవి చెప్పుకొచ్చారు.ఆ సమయంలో నాగబాబు అలా చెప్పడంతో విపరీతమైన కోపం వచ్చి కొట్టేశానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
నాగబాబును నేను కొట్టడంతో చిన్నోడిని కొడతావా అంటూ అమ్మ నన్ను తిట్టేసిందని మెగాస్టార్ వెల్లడించారు.నాన్న వచ్చిన తర్వాత ఏడుస్తూ మొత్తం చెప్పగా నాన్న నాగబాబును మందలించడంతో రిలీఫ్ గా అనిపించిందని చిరంజీవి తెలిపారు.మెగాస్టార్ చెప్పిన విషయాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
చిరంజీవి విశ్వంభర సినిమా( Vishwambhara ) పనులతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు.కొంతకాలం క్రితం చిరంజీవి వేగంగా సినిమాల్లో చేయాలని భావించినా భోళా శంకర్ రిజల్ట్ తర్వాత ఆయన నిర్ణయాలు మారాయని తెలుస్తోంది.
విశ్వంభర 2025 సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది.