కొన్ని స్థానాలు మినహా తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) నుంచి ఎంపీలుగా పోటీ చేసేందుకు అభ్యర్థుల జాబితాను దాదాపుగా సిద్ధం చేశారు.మరో నాలుగు స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయవలసి ఉంది.
ఇప్పటికే చేరికలతో జోష్ పెంచుతున్న కాంగ్రెస్ ,17 స్థానాలకు గాను, 15 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారనే అంచనాలతో ఉంది.బీఆర్ఎస్, బిజెపిలలోని కీలక నాయకులు ఎంతోమంది కాంగ్రెస్ లోకి వచ్చి చేరుతుండడంతో ఆ పార్టీలో ఉత్సాహం కనిపిస్తుంది .ఖమ్మం ,వరంగల్ ,కరీంనగర్, హైదరాబాద్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది.ఇప్పటికే దీనికోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy ), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షి నేడు ఢిల్లీకి వెళ్ళనున్నారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో( Parliament Elections ) అభ్యర్థుల ఎంపిక , పార్టీలో చేరికలు , తదితర అంశాలపై పార్టీ అధిష్టానం పెద్దలతో వారు చర్చించనున్నారు.ఈ చర్చల అనంతరం ఈరోజు సాయంత్రం మిగిలిన నాలుగు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.ముఖ్యంగా వరంగల్ నుంచి దొమ్మాట సాంబయ్య ,నమిళ్ళ శ్రీనివాస్, కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు, తీన్మార్ మల్లన్న పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.అలాగే ఖమ్మం సీటు కోసం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.
భట్టి విక్రమార్క తన భార్య కోసం, పొంగులేటి తన సోదరుడి కోసం టికెట్ ప్రయత్నాల్లో ఉన్నారు.వీటి పైన ఢిల్లీ పర్యటన( Delhi Tour )లో ఒక క్లారిటీ రానుంది.ఇప్పటికే కాంగ్రెస్( Congress MPs List ) ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల జాబితా ఒకసారి పరిశీలిస్తే… పెద్దపల్లి గడ్డం వంశీకృష్ణ, మల్కాజిగిరి సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ దానం నాగేందర్, చేవెళ్ల డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూల్ డాక్టర్ మల్లు రవి, నల్గొండ రఘువీర్ రెడ్డి, జహీరాబాద్ సురేష్ షెట్కర్, మహబూబాబాద్ బలరాం నాయక్, మహబూబ్నగర్ వంశీ చందర్ రెడ్డి, ఆదిలాబాద్ ఆత్రం సుగుణ, నిజామాబాద్ తాటిపర్తి జీవన్ రెడ్డి, మెదక్ నీలం మధు, భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి లు ఉన్నారు.