ప్రముఖ టాలీవుడ్ నటి కస్తూరి శంకర్( Actress Kasturi Shankar ) ఇంటర్వ్యూలు ఇస్తే ఆ ఇంటర్వ్యూలలో చెప్పిన విషయాలు ఒకింత హాట్ టాపిక్ అవుతాయి.ఒకింత బోల్డ్ గా మాట్లాడే కస్తూరి శంకర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీ స్థాయిలోనే ఉంది.
భార్యాభర్తలలో భార్య ముందు పోతే మాత్రం భర్త కృంగిపోతాడని డాడీ విషయంలో అది నేను కళ్లారా చూశానని ఆమె తెలిపారు.అమ్మ మరణం తర్వాత నాన్న ఐదు నెలలు మాత్రమే జీవించారని కస్తూరి అన్నారు.
ఇండియా నుంచి బయటకు వెళ్లిన సమయంలో ఇండియాపై ఆప్యాయత పెరిగిందని ఆమె తెలిపారు.మన భారతదేశంలో లేని విషయాలు ఎక్కడా లేవని ఆమె తెలిపారు.నేను కులానికో మతానికో వ్యతిరేకం కాదని కస్తూరి పేర్కొన్నారు.ఒకరినొకరు తక్కువ చేయడం అన్ని చోట్ల ఉందని ఆమె కామెంట్లు చేశారు.
విదేశాల్లో రూల్స్ పాటించే వాళ్లు మన దేశంలో రూల్స్ పాటించని సందర్భాలు ఉన్నాయని కస్తూరి అన్నారు.
ఒక అవార్డ్ కోసం హైదరాబాద్ ( Hyderabad )కు వచ్చిన వ్యక్తి తన భార్య నాకు బిగ్గెస్ట్ ఫ్యాన్ అని చెప్పారని నా ఫోటోషూట్స్ అంటే ఇష్టమని ఆ వ్యక్తి చెప్పారని కస్తూరి అన్నారు.కొంతమందికి బాటమ్ లైన్ దాటి ఉందని వాళ్లు అమ్మ, చెల్లి, అక్కను చూస్తే అలాంటి థాట్స్ ఉంటాయని ఆమె తెలిపారు.చేతిలో బిడ్డతో ఉన్న అమ్మాయిని కూడా తప్పు దృష్టితో చూసే వాళ్లు ఉన్నారని ఆమె తెలిపారు.
పెంపకం బాగున్న వాళ్లు అమ్మాయిలను మంచి దృష్టితో చూస్తారని మరి కొందరు మరో దృష్టితో చూస్తారని కస్తూరి పేర్కొన్నారు.కస్తూరి కెరీర్ పరంగా అడపాదడపా ఆఫర్లతో బిజీగా ఉన్నారని సమాచారం అందుతోంది.కస్తూరిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.కస్తూరి పారితోషికం కూడా భారీ రేంజ్ లోనే ఉంది.