Papaya Cultivation : బొప్పాయి పంటను ఆకుముడత వైరస్ నుంచి సంరక్షించే యాజమాన్య పద్ధతులు..!

బొప్పాయి పంట( Papaya Cultivation ) ను ఆశించే ఆకుముడత వైరస్ ఒక తెల్ల దోమ ద్వారా వ్యాపిస్తుంది.ఈ వైరస్ ఒక మొక్క నుంచి మరొక మొక్కకు చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది.

 Techniques To Protect Papaya Cultivation-TeluguStop.com

వ్యాధి సోకిన విత్తనాలు, మొలకలు లేదంటే పరికరాల ద్వారా కేవలం సెకండ్ల సమయంలో ఈ వైరస్ వ్యాప్తి జరుగుతుంది.టమాటా( Tomato ), పొగాకు మొక్కలు ఈ వైరస్ కు అతిధి మొక్కలుగా వ్యవహరిస్తాయి.

ఈ తెగుళ్లు ఆశించిన మొక్కలు ముడుచుకుపోతాయి.సారలు గట్టి పడతాయి.

ఆకుల తోలు వాలిపోయి పేమిలిగా మారుతుంది.మొక్కలు ఎదుగుదల తగ్గుతుంది.

బొప్పాయి పండ్ల సైజు చిన్నగా ఉంటాయి.ఈ తెగుల వల్ల ఆకులు అధికంగా ప్రభావితం అవుతాయి.

ఈ తెగుళ్లు బొప్పాయి పంటను ఆశించకుండా ఉండాలంటే.తెగులు నిరోధక విత్తన రకాలను( Mildew ) ఎంపిక చేసుకోవాలి.ఈ తెగుళ్ళకు అతిధి మొక్కలుగా ఉండే కలుపు మొక్కలు పొలంలో, పొలం చుట్టుపక్కల లేకుండా తొలగించాలి.ఎంతవరకు వీలైతే అంతవరకు రసాయన ఎరువుల వినియోగం, రసాయన పిచికారి మందుల వినియోగం తగ్గించాలి.

పంట కోతల అనంతరం పంట అవశేషాలను పొలం నుంచి పూర్తిగా తొలగించాలి.

సేంద్రీయ పద్ధతిలో( Organic Farming ) ఈ తెగుళ్లను అరికట్టాలంటే.వైట్ ఆయిల్ ఎమల్షన్స్ ను 1% సాంద్రత నీటిలో కలిపి పిచికారి చేయాలి.రసాయన పద్ధతిలో ఈ తెగుళ్లను అరికట్టేందుకు ఎలాంటి చికిత్స లేదు తెల్ల దోమల్ని నియంత్రిస్తే ఈ తెగుళ్లను వ్యాపించకుండా ఆపవచ్చు.

తెల్ల దోమలను( White mosquitoes Pests ) నియంత్రించాలంటే డైమిథోయెట్ లేదా మెటాసిస్టోక్స్ ద్రావణాన్ని 10 రోజులకు ఒకసారి బొప్పాయి ఒక్క ఆకులు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.ఇలా చేస్తే తెగుళ్లు రాకుండా ఉంటుంది.

తెగుళ్లు సోకితే నివారించడం చాలా కష్టం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube