తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్( Former Minister KTR ) ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ముఖ్యమంత్రికి రైతులంటే ఎందుకింత చిన్నచూపని కేటీఆర్ ప్రశ్నించారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని మండిపడ్డారు.ఇప్పుడు వడగండ్లు ముంచెత్తినా సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కనీసం కన్నెత్తి చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల కన్నీళ్లు( Farmers ) ముఖ్యమంత్రికి కనిపించవా అని నిలదీశారు.ఎన్నికల గోల తప్ప.రైతులపై సీఎంకు కనికరం లేదని విమర్శించారు. హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొట్టే సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్రంలోని రైతుల సమస్యలు వినే ఓపిక లేదా అని ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే రైతులకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేస్తామని తెలిపారు.