వేసవి కాలంలో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు రావద్దని కలెక్టర్ అనురాగ్ జయంతి( Collector Anurag Jayanthi ) అధికారులను ఆదేశించారు.జిల్లాలో తాగునీటి సరఫరా పై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లోని మీటింగ్ హాల్లో కలెక్టర్ అనురాగ్ జయంతి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లాలోని అన్ని మండలాలు, సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో నిత్యం తాగునీరు సరఫరా పై ఆరా తీశారు.ట్యాంక్ నుంచి ఇంటింటికీ నీటి సరఫరాలో ఎక్కడైనా లోపాలు ఉన్నాయో సరి చూసుకోవాలని, ఏమైనా లోపాలు ఉంటే వాటిని వెంటనే సరిచేయాలని ఆదేశించారు.
చిన్న చిన్న సమస్యలు ఉంటే స్థానికంగానే పరిష్కరించాలని, బడ్జెట్ ఎక్కువగా ఉండే పనులపై ఉన్నతాధికారులతో మాట్లాడి, ముందుకు వెళ్లాలని సూచించారు.
వేసవి( Summer Season )ని దృష్టిలో పెట్టుకొని పక్కా ప్రణాళికతో ఉండాలని ఆదేశించారు.
మిషన్ భగీరథ తాగునీటి సరఫరాలో ఎక్కడైనా ఉంటే, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.అభివృద్ది పనుల్లో భాగంగా ఎక్కడైనా పైప్ లైన్ పాడైతే సంబంధిత శాఖ అధికారులతో పనులు చేయించాలని పేర్కొన్నారు.
ఎంపీడీఓలు, ఎంపీఓలు గ్రామాల్లో ప్రతినిత్యం పర్యటించాలని, ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, జెడ్పీ సీ.ఈ.ఓ.ఉమారాణి, డీ.పీ.ఓ వీర బుచ్చయ్య, మిషన్ భగీరథ ఈఈలు జానకి, విజయ్ కుమార్, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు లావణ్య, అన్వేష్, అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏఈలు,తదితరులు పాల్గొన్నారు.