Rajanna Sircilla : గంజాయి అమ్ముతున్న వ్యక్తి పై కేసు నమోదు ,అరెస్ట్ రిమాండ్ కు తరలింపు: చందుర్తి సి ఐ ఏ .కిరణ్ కుమార్

04-03-2024 రోజున రుద్రంగి ఎస్సై సిరిసిల్ల అశోక్ కి వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు ఒక వ్యక్తి గంజాయి అమ్ముతున్నాడని సమాచారం మీద తన సిబ్బందితో వెళ్లి రుద్రంగి గ్రామ శివారులోని ఎల్లమ్మ గుడి వద్ద రుద్రంగి గ్రామానికి చెందిన ఎండి జమీర్ సంవత్సరాలు, అను వ్యక్తి గత కొంతకాలంగా గంజాయి మత్తుకు బానిసై విపరీతమంగా గంజాయి తాగుతూ అదే విధంగా రుద్రంగి చుట్టుపక్కల గ్రామాలలో యువకులకు గంజాయిని( Marijuana ) అధిక ధరలకు చేరవేస్తూ యువతను గంజాయికి బానిస అయ్యే విధంగా చేస్తున్నాడు, అతని వద్ద 400 గ్రాముల ఎండు గంజాయిని పట్టుకొని పంచనామా చేసి ఇచ్చిన ఫిర్యాదు పై చందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్( Chandurthi CIA.Kiran Kumar ) కేసు పరిశోధన చేసి నిషేదిత గంజాయిని అమ్ముతున్న వ్యక్తి అయినా ఎండి.జమీర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించనైనది, ఎవరైనా గంజాయి ని అమ్మిన, కల్గి ఉన్న, సరఫరా చేసినా వారి పైన ఎన్ డి పి ఎస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకొనబడుతాయి , పీడీ యాక్ట్ కూడా విధించబడును, గంజాయి,మత్తు పదార్థాలు ప్రాణాంతకం యువత ఎవరు కూడా గంజాయికి ,మత్తు పదార్థాలకు బానిస కావొద్దు మీ యొక్క జీవితాలను నాశనం చేసుకోకూడదు, రాజన్న సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్( Rajanna Sircilla SP Akhil Mahajan ) ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో డీ అడీక్షన్ సెంటర్ నిర్వహిస్తున్నారు.ఎవరైనా గంజాయి ,మత్తు ,డ్రగ్స్ కు బానిసలుగా మారిన వారు చెడు అలవాటు మాన్పించటానికి డీ అడిక్షన్ సెంటర్ ను వినియోగించుకోవాలని ఈ సమావేశంలో చందుర్తి సిఐ కిరణ్ కుమార్ తెలిపారు.

 Case Registered Against Person Selling Ganja Moved To Remand Chandurthi Cia Kir-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube