తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి( Chiranjeevi ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయన చేసిన సినిమాలు ఆయనకు వచ్చిన అవార్డులే ఆయన గురించి ప్రత్యేకంగా అందరికీ తెలియజేస్తాయి.
ఇక ఇలాంటి క్రమంలో చిరంజీవి లాంటి స్టార్ హీరో సినిమాలో ఎవరికైనా అవకాశం వస్తే ఆ అవకాశాన్ని వదులుకోకుండా నటించి మంచి గుర్తింపు సంపాదించుకోవాలని చూస్తారు.ఇక అందులో భాగంగానే ఆయన సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నటు వంటి నటీనటులు చాలా మంది ఉన్నారు.
ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు స్టార్ హీరోగా శోభన్ బాబు చిరంజీవి చేసిన మాస్టర్ సినిమా( Master Movie )లో ఒక క్యారెక్టర్ కోసం ఆయన్ని సంప్రదించగా ఆయన నేను వేరే వాళ్ల సినిమాల్లో చేయను హీరో గానే చేస్తాను లేదంటే కామ్ గా ఉంటాను అని చెప్పారట.
దాంతో చిరంజీవి ఆ సినిమా నుంచి ఆ స్పెషల్ క్యారెక్టర్ ని కూడా తీసేయించాడు.ఎందుకంటే ఆ క్యారెక్టర్ కి ఒక స్ట్రెచర్ ఉన్న వాళ్ళు చేస్తే బాగుంటుంది.దాన్ని ఒక పెద్ద నటుడితో చేయిస్తేనే అది సక్సెస్ అవుతుంది.
లేకపోతే ఆ క్యారెక్టర్ అనేది పెద్దగా ఎలివేట్ అవ్వదనే ఉద్దేశ్యం తో ఆ క్యారెక్టర్ ను సినిమా నుంచి తీయించారంట.ఇక శోభన్ బాబు( Sobhan Babu ) చిరంజీవి సినిమాలో కూడా నటించలేదు.
ఇక ఆయన ఒక్కసారి హీరోగా రిటైర్మెంట్( Retirement ) ప్రకటించారు అంటే మరోసారి ఆయన మొఖానికి మేకప్ వేసుకోలేదు.అలాంటి ఒక నిబద్ధతతో ఆయన చివరి రోజుల్లో ఉండడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.అందుకే శోభన్ బాబు ఒకప్పుడు మంచి విజయాలను అందుకొని సక్సెస్ ఫుల్ హీరోగా( Successful Hero ) ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.ఇక తన అభిమానులా హృదయం లో ఆయన ఎప్పటికీ అలానే ఉండిపోవాలనే ఉద్దేశ్యం తో అలా ఏ సినిమాలో కూడా నటించలేదు…
.