Cauliflower Crop : క్యాలీఫ్లవర్ పంటకు తీవ్ర నష్టం కలిగించే కుళ్ళు తెగుళ్లను అరికట్టే పద్ధతులు..!

క్యాలీఫ్లవర్ పంట( Cauliflower Crop ) విస్తీర్ణం ప్రతి ఏడాది పెరుగుతోంది.అధిక దిగుబడులు వస్తూ ఉండడంతో రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు.

 Methods To Prevent The Pests That Cause Serious Damage To The Cauliflower Crop-TeluguStop.com

క్యాలీఫ్లవర్ పంట సాగుకు చల్లని తేమతో కూడిన వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది.కొన్ని సరైన యాజమాన్య పద్ధతులను పాటించడం వల్ల ఊహించని అధిక దిగుబడులు పొందవచ్చు.

ఈ పంట సాగుకు నల్ల రేగడి, ఎర్ర నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.ఒక ఎకరాకు దాదాపుగా 250 గ్రాముల విత్తనాలు అవసరం.

విత్తేముందు ఒక కిలో విత్తనాలకు మూడు గ్రాముల థైరంతో విత్తనశుద్ధి చేసుకోవాలి.ఆరోగ్యకరమైన నారు పెంచాలంటే.

నారు మడులను నేలకు పది నుంచి 15 సెంటీమీటర్ల ఎత్తుగా తయారు చేసుకోవాలి.ఆ మడులపై అచ్చుగా గీతలు గీసుకుని విత్తనాలను వేసి మెత్తటి మట్టితో కప్పి వేయాలి.

ఒకసారి నీటి తడిని అందించిన తర్వాత ఆ మనులపై వరిగడ్డిని పలుచగా వేసుకోవాలి.నీటి తడి అందించినప్పుడు మడులలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.

Telugu Agriculture, Cauliflower, Copper, Farmers-Latest News - Telugu

నారుదశలో ఆకు తినే పురుగులు ఆశించే అవకాశం ఉంది.ఈ పురుగుల నివారణ కోసం ఒక లీటరు నీటిలో 2.5 ml మాలాథియాన్( Malathion ) ను కలిపి పిచికారి చేయాలి.

Telugu Agriculture, Cauliflower, Copper, Farmers-Latest News - Telugu

నారు వయస్సు 25 నుంచి 30 రోజుల మధ్య ఉంటే ప్రధాన పొలంలో నాటుకోవాలి.మొక్కల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల వరుసల మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు నాటుకోవాలి.క్యాలీఫ్లవర్ పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగుళ్ల విషయానికి వస్తే కుళ్ళు తెగుళ్లు కీలక పాత్ర పోషిస్తాయి.

కుళ్ళు తెగుళ్లు పంట నారు దశలో ఉన్నప్పుడు నాటిన తర్వాత కూడా ఆశించే అవకాశాలు చాలా ఎక్కువ ఈ కుళ్ళు తెగుళ్లు మొక్క నుండి పువ్వుకు కూడా వ్యాప్తి చెంది మొక్కతో పాటు పువ్వు కూడా కుళ్లిపోయేలా చేస్తుంది.ఈ తెగుళ్లు ఆశిస్తే కచ్చితంగా పంట మార్పిడి పద్ధతి పాటించాలి.

ఈ తెగుళ్ల నివారణ కోసం ఒక లీటర్ నీటిలో మూడు గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్( Copper oxychloride ) కలిపి మొక్క చుట్టూ ఉండే నేల పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేసి తొలి దశలోనే ఈ తెగుళ్లను నివారించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube