ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణకు రానున్నారు.ఈ మేరకు వచ్చే నెల 4వ తేదీన ఆయన రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
హైదరాబాద్ లో నిర్వహించే బీజేపీ విజయసంకల్ప సభకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు.ప్రధానితో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా సభలు కూడా నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.
అయితే త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో తెలంగాణలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే జాతీయ నాయకులు సభలు, సమావేశాలు నిర్వహించనున్నారని సమాచారం.