ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు..!!

తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి( Lakshmi Parvati ) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశారు.విషయంలోకి వెళ్తే ఆమె సూర్యపేట జిల్లా నడిగూడెంలో ఓ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

 Lakshmi Parvati Key Comments On Chief Minister Revanth Reddy , Lakshmi Parvati,-TeluguStop.com

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ( Revanth Reddy )రాజకీయ పరిణితి అనుభవం లేదని అన్నారు.దీంతో రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ప్రజలకు కష్టాలు తప్పవని హెచ్చరించడం జరిగింది.

కాంగ్రెస్( Congress ) పాలిత రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు… స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదని అన్నారు.

రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న కాంగ్రెస్ పెద్దలు అనుమతి తప్పనిసరి అంటూ ఎద్దేవా చేశారు.ప్రజల సమస్యల పరిష్కరించటం అంటే ఎన్నికల ప్రచారంలో హామీలు ఇచ్చినంత సులువు కాదు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ( kcr )తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో… ముందంజలో నడిపించారు.

ప్రతి రంగం అభివృద్ధి చెందేలా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.కేసీఆర్ హయాంలో వ్యవసాయానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఈ క్రమంలో రైతులు ఎంతగానో లాభపడ్డారు.భూగర్భ జల వనరులు పెరిగేందుకు.

మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పూడికతీత చేపట్టారని వ్యాఖ్యానించారు.అంతేకాకుండా మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందించినట్లు లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube