నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నంది అవార్డుల ప్రధానోత్సవం( Nandi Awards Ceremony ) చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంది అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.

 Gaddar Awards Instead Of Nandi Awards Cm Revanth Reddy Key Announcement Gaddar A-TeluguStop.com

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అదే విధంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు.అయితే రాష్ట్ర విభజన జరగటంతో నంది అవార్డుల కార్యక్రమం గందరగోళంగా మారింది.

ఆంధ్రాలో ఏర్పడిన రెండు ప్రభుత్వాలు తెలంగాణలో అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఏవి కూడా నిర్వహించలేదు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో.కాంగ్రెస్ ప్రభుత్వం( Congress ) కొలువుదీరిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా అవార్డులపై కీలక ప్రకటన చేశారు.

విషయంలోకి వెళ్తే బుధవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన గద్దర్ జయంతి కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ( CM Mallu Bhatti Vikramarka )పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.

నంది అవార్డులు పునరుద్ధరించాలని సినీ ప్రముఖులు కోరారు.దీంతో నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు.

గద్దరన్న పేరు మీద సినీ కళాకారులకు పురస్కారాలు అందజేస్తామని తెలిపారు.దీనిపై త్వరలో జీవో విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube