కేసీఆర్ చిక్కుల్లో పడ్డారా ? రేవంత్ పంతం నెరవేరుతుందా ?

గత బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS Government ) హయాంలోనూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసుకుని అనేక చర్యలకు బీఆర్ఎస్ పెద్దలు దిగిన సంగతి తెలిసిందే, రేవంత్ రెడ్డి పై అనే కేసులు నమోదు చేయడంతో పాటు, జైలుకు వెళ్లేలా చేశారు.అప్పట్లోనే కేసీఆర్, కేటీఆర్ లపై రేవంత్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

 Cm Kcr Vs Revanth Reddy Politics,brs, Telangana, Kcr, Ktr, Kokapeta Land Issue,-TeluguStop.com

కేసీఆర్ ను ఎప్పటికైనా జైలుకు పంపిస్తానంటూ శఫదాలు చేశారు.ఊహించిన విధంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) బాధ్యతలు స్వీకరించడంతో, కెసిఆర్ పై పాత పగ తీర్చుకుంటారని అంత అంచనా వేశారు.

దీనికి తగ్గట్లుగానే గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారాలను ఒక్కొక్కటిగా రేవంత్ వెలికి తీస్తున్నారు.తాజాగా కెసిఆర్ హయంలో కోకాపేటలో 11 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు టిఆర్ఎస్ భవనానికి కేటాయించిన వ్యవహారంపై కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని తెలంగాణ హైకోర్టు( Telangana Government ) సంచలన ఆదేశాలు జారీ చేసింది.

Telugu Aicc, Kokapeta, Pcc, Telangana-Politics

బీఆర్ఎస్ కు చౌకగా భూములు కేటాయించడం పై హైకోర్టులో గతంలో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది.సర్వే నెంబర్ ౨౩౯, 250లో 11 ఎకరాలను సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ పేరుతో మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు కేటాయించారని పిటీషన్ దాఖలు అయింది.ఎకరా 50 కోట్లు విలువైన భూమి 3.41 కోట్లకే కేటాయించారని, ఐదు రోజుల్లోనే పూర్తయిన ఈ ప్రక్రియ వల్ల తెలంగాణ ప్రభుత్వానికి 1100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లుగా పిటిషనర్ పేర్కొన్నారు.వెంటనే ఈ కేటాయింపులను రద్దుచేసి ఏసీబీ కేసు నమోదు చేసే విధంగా ఆదేశించాలని కోరారు .పిటిషన్ లో ప్రతివాదులుగా కేసీఆర్( KCR ) పేరు కూడా ఉండడంతో ఆయనపైనా, సంబంధిత రెవెన్యూ అధికారుల పైన కేసు నమోదు చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Telugu Aicc, Kokapeta, Pcc, Telangana-Politics

కెసిఆర్ పై ఈ పిటిషన్ వేసిన వ్యవహారంలో రేవంత్ కు సంబంధం లేకపోయినా, కేసీఆర్ ను జైలుకు పంపిస్తానని గతంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు, నిన్ననే త్వరలో ఆయనను బోనులో వేస్తామంటూ రేవంత్ వ్యాఖ్యానించిన రోజునే కెసిఆర్ పై కేసు నమోదు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.పులి బయటకు వస్తుందని బీఆర్ఎస్ నేతలు( BRS Leaders ) ప్రచారం చేస్తూ ఉండడం పై రేవంత్ స్పందిస్తూ పులి బయటకు వస్తే బోను రెడీగా ఉందని కౌంటర్ ఇవ్వడం వంటివి చోటు చేసుకున్న రోజే కెసిఆర్ పై కేసు నమోదు కావడంతో త్వరలోనే రేవంత్ పంతం నెరవేరే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube