నవగ్రహాల్లో కుజ గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.ఈ గ్రహ సంచారం చేసినప్పుడు కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావం చూపిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
సంచారానికి మానవ జీవితంపై ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.కుజుడు ఎవరి జాతకం( Horoscope )లో అయినా అనుకూల స్థానంలో ఉంటే ఎన్నో లాభాలు కలుగుతాయి.
ఈ నేపథ్యంలోనే కుజుడు 16వ తేదీన ధనస్సు రాశి( Dhanusu Rasi )లోకి అడుగుపెట్టాడు.దీంతో మూడు రాశులకు చెందిన వ్యక్తులకు అదృష్టాన్ని తెస్తుంది.
వీరికి సంపాదన పెరగడమే కాకుండా ఇందులో స్టూడెంట్స్ ఉన్నా కూడా అనుకూల పరిస్థితులు కలుగుతాయని చెబుతున్నారు.అయితే ఆ మూడు రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్కాటక రాశి:
ఈ రాశికి చెందిన వ్యక్తులు కుజుడు సంచారం ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తుంది.వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది.వీరు ఎప్పుడు ఏ సమయంలో పని ప్రారంభించిన విజయాన్ని అందుకుంటారు.అంతేకాకుండా జీవితంలో సుఖసంతోషాలు కలుగుతాయి.ముఖ్యంగా ఉద్యోగస్తులు ఆఫీసులో మంచి పేరు, ప్రతిష్టలు సంపాదిస్తారు.ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి.వ్యాపారస్తులు లాభాలను పొందుతారు.
మేషరాశి:
ధనస్సులోకి కుజుడు సంచారం చేయడం వలన మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది.అంతేకాకుండా శుభవార్తలు వింటారు.మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.
ఎప్పటినుండో ఆటంకాలు ఏర్పడుతున్న పనులు ముందుకు కదులుతాయి.ఎప్పటినుంచో ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగస్తులకు కూడా శుభవార్త వినే అవకాశం ఉంటుంది.
విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అవకాశం లభించే ఆస్కారం ఉంది.కానీ ఈ రాశి వారు ఆరోగ్యానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
సింహరాశి:
ఈ రాశి వారికి కుజుడు సంచారం శుభప్రదంగా ఉంటుంది.ఈ రాశి ప్రేమికులకు సంతోషకరమైన వార్త వినే అవకాశం ఉంటుంది.
ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లయితే త్వరలోనే మీ ప్రేమ సక్సెస్ అవుతుంది.అంతేకాకుండా విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలితం అవుతాయి.