సాధారణంగా రూ.2 వెచ్చిస్తే పేపర్‌క్లిప్ దొరుకుతుంది.ఇంతకుమించి ధర ఎవరూ కూడా వాటికి పెట్టరు.కానీ ఒక కంపెనీ మాత్రం ఓ పేపర్‌క్లిప్ ధరను అక్షరాలా రూ.33,540గా నిర్ణయించింది.బట్టలు, ఉపకరణాలను తయారు చేసే ప్రముఖ ఇటాలియన్ బ్రాండ్ ప్రాడా దీనిని తయారు చేసింది.
ఈ కంపెనీ కానీ స్టైల్ బ్రాండ్ నేమ్ కారణంగా చాలా వస్తువులు ధరలను అతిగా నిర్ణయిస్తుంది.అయితే ఈ కంపెనీ తయారు చేసిన పేపర్‌క్లిప్ ఉత్పత్తి ఇప్పుడు సోషల్ మీడియా( Social Media )లో చాలా విమర్శలకు కారణమైంది.
ఇది ‘మనీ క్లిప్‘ అని పిలిచే ఓ మామూలు పేపర్‌క్లిప్.ప్రాడా మొదటిసారిగా 2017లో ఈ పేపర్‌క్లిప్‌ని విడుదల చేసింది.డబ్బును కలిపి ఉంచడానికి ఇది ఉపయోగించబడుతోంది.వెండితో తయారైన దానిపై ‘ప్రాడా‘ అనే పదం ఉంది.ఇది 6.5 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది.ఈ పేపర్‌క్లిప్ ధర చాలా ఎక్కువ.భారతదేశంలో దీని ధర రూ.33,540.అంటే USలో దాదాపు 400 డాలర్లు.
చాలా పేపర్‌క్లిప్( Paperclip )లు చాలా చౌకగా ఉంటాయి.మీరు స్టేషనరీ స్టోర్‌లో రూ.100 కంటే తక్కువ ధరతో అనేక పేపర్‌క్లిప్‌లను కొనుగోలు చేయవచ్చు.
ప్రాడా పేపర్‌క్లిప్ కొనడం డబ్బు వృధా అని చాలా మంది సోషల్ మీడియాలో ఎగతాళి చేశారు.ప్రాడా పేపర్‌క్లిప్( Prada Paperclip, )ని కొనడం తెలివితక్కువ పని అని ఇంకొకరు అభిప్రాయపడ్డారు.పేపర్‌క్లిప్‌ను ఎవరైనా కొనుగోలు చేసినా ఈ విలువైన ఉత్పత్తిని వారి నుంచి ఎవరో ఒకరు దొంగిలించేవారని మరో వ్యక్తి చెప్పాడు.
ఇంత సాదాసీదా క్లిప్‌కు ఎవరు వేల రూపాయలు వెచ్చించి కొంటారని మరికొందరు సందేహం వ్యక్తం చేశారు.ఏదేమైనా ఇంత ధర దీనికి పెట్టడం నిజంగా అన్యాయమే అని చెప్పుకోవచ్చు.