ప్రస్తుతం ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమం లోనే అల్లరి నరేష్ ( Allari Naresh )ప్రస్తుతం వేరే హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు.
నిజానికి నాంది సినిమాతో( Nandi ) తన సెకండ్ ఇన్నింగ్స్ ని గ్రాండ్ గా మొదలుపెట్టి మంచి సక్సెస్ ని అందుకున్నప్పటికీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో నరేష్ మార్కెట్ మళ్లీ డౌన్ అయిపోయింది.
దాంతో రీసెంట్ గా నాగార్జున( Nagarjuna ) హీరోగా వచ్చిన నా సామిరంగ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించి తనకంటూ ప్రత్యేక మైన గుర్తింపు ను ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఇలాంటి క్రమం లోనే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తున్నప్పటికీ ఆయనకి సోలో హీరోగా మాత్రం సినిమాలు పెద్దగా కలిసి రావడం లేదని చాలా మంది వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.నిజానికి అల్లరి నరేష్ లాంటి నటుడు మంచి క్యాపబిలిటీ ఉన్న నటుడు అయినప్పటికీ ఆయన మంచి కంటెంట్ ఉన్న స్టోరీ లు చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.
అతనికి సోలో హీరోగా కూడా పెద్దగా అవకాశాలు రావడం లేదనే వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇప్పుడూ ఆయన చేసిన ప్రతి సినిమా కూడా పెద్దగా ఎఫెక్ట్ అయితే చూపించలేకపోతున్నాయి.కాబట్టి ఇకమీదట తను ఇండస్ట్రీ లో కొనసాగాలంటే మాత్రం కొన్ని మంచి కథలను ఎంచుకొని మన ముందుకు రావాలి అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.లేకపోతే స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆయనకు మంచి అవకాశాలు అయితే వస్తాయి ఆయన హీరో గా ఉండాలంటే మంచి కథలు మంచి డైరెక్టర్లను ఎంచుకోవాలి లేదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయాలి అనుకుంటే మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా చాలా ఫ్రీ గా ఉండచ్చు…
.