సుగంధ కోకిల నూనెతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

సుగంధ కోకిల నూనెతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.అయితే సుగంధ కోకిల ఎండిన బెర్రీల నుండి తీస్తారు.

 Do You Know How Many Benefits Of Asugandha Kokila Oil,, Sugandha Kokila Oil, Di-TeluguStop.com

ఈ సుగంధ కోకిల ఆయిల్ ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగిస్తారు.అయితే ఈ నూనె ప్రత్యేకమైన ఆహ్లాదకరమైన వాసన కలిగి ఉంటుంది.

అలాగే ఇందులో ఉన్న ఔషధ గుణాలు, అలాగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.సుగంధ కోకిల నూనె కేంద్ర నాడి వ్యవస్థకు చాలా సహజమైన టానిక్ లా పనిచేస్తుంది.

అయితే ఈ ఆయిల్ మనసుకు విశ్రాంతిని ఇస్తుంది.అలాగే ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం కూడా కలిగిస్తుంది.

అయితే ఈ ఆయిల్ ను వాడడం వలన ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్న కారణంగా శరీరంలో వాపు, నొప్పి చికిత్సకు అద్భుతంగా పనిచేస్తుంది.

Telugu Cough, Care, Tips, Skincare, Sugandhakokila-Telugu Health

ఇక సుగంధ కోకిల నూనె జీర్ణ వ్యవస్థ( Digestive system )కు కూడా అద్భుతమైన ఔషధంలా ఉపయోగపడుతుంది.ఇక దీనిలో యాంటీసెప్టిక్, యాంటీ మైక్రోబయో లక్షణాలతో ఉంటుంది.కాబట్టి ఇది చర్మం, జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది.

ఇక చాలామంది ముఖంపై మొటిమలు, మచ్చలు, మంగు మచ్చలతో ఎంతో ఇబ్బంది పడుతుంటారు.అలాంటి వారు ఈ ఆయిల్ ను ముఖానికి రాసుకోవడం వలన చర్మ రంధ్రాల నుండి మురికి తొలగిపోయి, మొటిమలు తగ్గిపోతాయి.

ఇక ఈ సుగంధ కోకిల ఆయిల్ ను తలనొప్పి వచ్చినప్పుడు కూడా కొబ్బరి నూనె( Coconut Oil )లో ఒక రెండు చుక్కలు వేసి కలిపి మసాజ్ చేస్తే తలనొప్పి నుండి వెంటనే ఉపశమనం పొందవచ్చు.

Telugu Cough, Care, Tips, Skincare, Sugandhakokila-Telugu Health

ఇక ఆ తర్వాత మంచి నిద్రలోకి జారుకుంటారు.అలాగే నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఈ సుగంధ కోకిల నూనె బాగా పనిచేస్తుంది.ఈ ఆయిల్ ను చేతికి అప్లై చేసుకుని ఆ చేతులనీ ముక్కు దగ్గర పెట్టి పిలుస్తూ పడుకుంటే నిద్రలోకి వెంటనే జారుకుంటారు.

అలాగే జలుబు, దగ్గు ( Cold, cough )సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఈ ఆయిల్ ను నీటిలో వేసి మరిగించి దాని ఆవిరి పట్టించినట్లయితే ఆ జలుబు, దగ్గు నుండి బయటపడవచ్చు చాలామంది ఒత్తిడితో ఇబ్బంది పడుతుంటారు.అలాంటి వాళ్ళు ఈ ఆయిల్ వాసనను పీల్చినట్లైతే మానసికమైన ప్రశాంతత కూడా పొందుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube