తేజ సజ్జా( Teja Sajja ) ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన హనుమాన్ సినిమా ( Hanuman movie )నిన్న థియేటర్లలో విడుదలైంది.నిన్న సాయంత్రం నుంచి ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శితమయ్యాయి.
పెయిడ్ ప్రీమియర్స్ తోనే కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లతోనే బ్రేక్ ఈవెన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.బీ, సీ సెంటర్లలో సైతం ఈ సినిమా బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి.
ఈ సినిమాకు ఎక్కువ సంఖ్యలో స్క్రీన్లు కేటాయిస్తే మాత్రం హనుమాన్ మూవీ కలెక్షన్ల పరంగా సంచలన రికార్డ్ లను సొంతం చేసుకుంటుందని చెప్పవచ్చు.ఈ సినిమా చిన్న సినిమాలలో ఇండస్ట్రీ హిట్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
హనుమాన్ విషయంలో ఇతర సినిమాల డిస్ట్రిబ్యూటర్లు కఠినంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు.సంక్రాంతికి విడుదలయ్యే ఇతర సినిమాలకు సైతం హనుమాన్ స్థాయిలో పాజిటివ్ టాక్ రావడం సులువు కాదు.

తేజ సజ్జా రెమ్యునరేషన్( Remuneration ) పరంగా చిన్న హీరో అయినా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో మాత్రం పెద్ద హీరోనే అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ప్రశాంత్ వర్మ సైతం హనుమాన్ సక్సెస్ తో ఇతర రాష్ట్రాల్లో సైతం క్రేజ్ ను పెంచుకునే ఛాన్స్ ఉంది.నార్త్ లో సైతం ఈ సినిమా బుకింగ్స్ అంతకంతకూ పెరుగుతోంది.హనుమాన్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.

హనుమంతుని ఆశీస్సులు సైతం హనుమాన్ మూవీకి ఉన్నాయని అందుకే ఈ సినిమాకు కలెక్షన్లు అంతకంతకూ పెరుగుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.హనుమాన్ సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.హనుమాన్ సక్సెస్ తో 2024 సంవత్సరంలో తొలి బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది.