ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ వైద్యం:డా''మురళీధర్ రావు.

ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ, ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్య పరీక్షలు, కాన్పు చేయించుకోవాలి.రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే ఈ రోజు సామాజిక ఆరోగ్య కేంద్రం లో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డా” బాబు గ తెలిపారు.

 Government Medicine Against Private Hospitals Dr. Muralidhar Rao, Muralidhar Rao-TeluguStop.com

ఇందులో భాగంగా ఈ రోజు 57 మంది గర్భిణీ స్త్రీలను పరీక్షించి వారికి తగిన వైద్య పరీక్షలు నిర్వహించారు.అలాగే వారికి ఆహార అలవాట్లు పై, గర్భిణిగా ఉన్న సమయం లో వ్యాయామాలు పై పూర్తి అవగాహన కల్పించారు.

మొదటి చెక్ అప్, రెండవ చెక్ అప్, మూడవ చెక్ అప్, నాల్గవ చెక్ అప్ ఏ సమయంలో చేయించాలి, అలాగే ఎక్కడ సంప్రదించాలి అనే దాని పై అవగాహన కల్పించారు.అలాగే స్కానింగ్, రక్త పరీక్షలు చేయించుకోవడానికి ప్రభుత్వ ఆసుపత్రి లో అవకాశం ఉంది అని తెలిపారు.

హై రిస్క్ ఉన్న గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపారు.గర్భిణీ సమయం లో వచ్చే మెడికల్ సమస్యల ( రక్త హీనత, బి.పి, షుగర్, తైరాయిడ్, ఇన్ఫెక్షన్ లు మొదలగునవి) పై అవగాహన మరియు చికిస్త అందించడం జరిగింది.పరీక్షల కోసం 102 వాహనం, కాన్పు కొరకు 108 వాహనాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ప్రతి ఒక్కరూ ఎల్లారెడ్డి పెట్, సిరిసిల్ల, వేములవాడ లోని ప్రభుత్వ ఆసుపత్రి లో కాన్పు కావాలి అని కోరారు.ప్రైమీ మరియు ప్రీవియస్ నార్మల్ ఉన్న వారు సామాజిక ఆరోగ్య కేంద్రం లో డెలివరీ అయ్యే అవకాశం ఉంటుందని, మిగితా వారు ప్రభుత్వం ఆసుపత్రి లో డెలివరీ కావాలని కోరారు.

ప్రతి మంగళవారం, శుక్రవారం సామాజిక ఆరోగ్య కేంద్రం లో గర్భవతులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు అని తెలిపారు.ఇందులో భాగంగా ఈ రోజు ఎల్లారెడ్డి పెట్, కిషన్ దాస్ పెట్, బొప్పాపూర్, గొల్లపల్లి సబ్ సెంటర్ లకు చెందిన గర్భిణీ స్త్రీలకు పరీక్షలు నిర్వహించడం జరిగింది అని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్త్రీ వైద్య నిపుణులు డా” కిరణ్మయి, జిల్లా ప్రధాన ఆసుపత్రుల పర్యవేక్షకులు డా” మురళీధర్ , జిల్లా వైద్యాధికారి డా” సుమన్ మోహన్ రావు, సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డా” ప్రదీప్, డా” రఘు, మిడ్ వైఫ్ నర్సింగ్ ఆఫీసర్ శిరీష, ఎం.ఎల్.ఏచ్.పిలు మమత, లక్ష్మి ప్రసన్న, స్నేహ, స్టాఫ్ నర్స్ సునీత , ఏ.ఎన్ ఎం లు, ఆశాలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube