ఇవి మూల మలుపులు కాదు యమపురికి దారులు...!

యాదాద్రి భువనగిరి జిల్లా:సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మూల మలుపులతో నిర్మాణమైన రహదారులపై సూచిక బోర్డులు ఏర్పాటు చేయక,స్పీడ్ బ్రేకర్లు వేయక వేగంగా రాకపోకలు సాగించే వాహనాలతో డేంజర్ జోన్ గా మారిందని ప్రజలు, వాహనదారులు వాపోతున్నారు.ఒకవైపు మూడు రహదారులు కలిసి జంక్షన్,మరోవైపు యూ టర్న్ లో వేగంగా దూసుకొచ్చే వాహనాలతో నిత్యం ప్రమాదాలు సంభవిస్తూ జనాలు ఇబ్బందులు పడుతున్నారని,ముఖ్యంగా చౌటుప్పల్,నల్లగొండ రోడ్డులో కంఠమహేశ్వర దేవాలయం దగ్గర,గ్రామ పంచాయతీ ఆవరణలో,ఊరి చివరణ స్మశానవాటిక ప్రాంగణంలో మునుగోడు చండూరు వెళ్లే దారిలో కొత్తగా వచ్చే వాహనదారులు ఏ మాత్రం ఆదమరిచినా టిక్కెట్ డైరెక్ట్ గా యమపురికేనని ఆందోళన చెందుతున్నారు.

 These Are Not Turning Points But The Roads To Yamapuri , Yamapuri , Sansthan Nar-TeluguStop.com

ఆ ప్రాంతంలో విధి దీపాలు లేకపోతే చీకట్లో వాహనాలు పొలాల్లోకి దూసుకెళ్లే పరిస్థితి ఉందని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మూల మలుపుల వద్ద సూచిక బోర్డులు,బ్రేక్ డివైడర్లు ఏర్పాటు చేసి ప్రయాణికులకు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube