ప్రభాస్ నాగ్ అశ్విన్ ( Nag Ashwin ) కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి మూవీ ( Kalki Movie )సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.కల్కి సినిమా ఇప్పటికే 600 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించడం గమనార్హం.
కల్కి మూవీ బాక్సాఫీస్ వద్ద సాధించిన 10 రికార్డులు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.ఫస్ట్ వీకెండ్ లో ఎక్కువ మొత్తం కలెక్షన్లు సాధించిన రికార్డ్ ను కల్కి సొంతం చేసుకుంది.
ఇప్పటివరకు జవాన్ ( Jawan )పేరుపై ఈ రికార్డ్ ఉండగా ఆ రికార్డ్ ను కల్కి 2898 ఏడీ సినిమా బ్రేక్ చేసింది. మలేషియాలో( Malaysia ) సలార్ పేరుపై ఉన్న రికార్డ్ ను సైతం కల్కి తమిళ్ వెర్షన్ బ్రేక్ చేసింది.
నార్త్ అమెరికాలో ఫస్ట్ వీకెండ్ లోనే 11 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాగా కల్కి నిలిచింది.వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర హాలీవుడ్ సినిమాలకు ధీటుగా కలెక్షన్లను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.
ఈ ఏడాది ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా కూడా కల్కి కాగా హనుమాన్( Hanuman ) సాధించిన కలెక్షన్ల రికార్డ్ ను సైతం ఈ సినిమా బ్రేక్ చేసింది.ఈ ఏడాది తొలిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా కూడా కల్కి కావడం గమనార్హం.కెనడాలో( Canada ) అత్యధిక కలెక్షన్లను సాధించిన తొలి తెలుగు మూవీగా కల్కి నిలిచింది.ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్3 సినిమాల జాబితాలో కల్కి నిలవడం గమనార్హం.
కల్కి 2898 ఏడీ సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను ఖాతాలో వేసుకునే అవకాశాల్లు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.కల్కి 2898 ఏడీ సక్సెస్ తో ప్రభాస్ కెరీర్ లో మరో మెమరబుల్ హిట్ చేరిందనే చెప్పాలి.ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లతో కెరీర్ పరంగా మరింత ఎదగాల్సి ఉంది.