వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహుర్తం ఖరారు అయిందని తెలుస్తోంది.ఈనెల 6వ తేదీన ఢిల్లీ వేదికగా ఆమె హస్తం గూటికి చేరతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో వైఎస్ షర్మిల రేపు లేదా ఎల్లుండి ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది.మరోవైపు ఆమె తన నివాసంలో పార్టీ నేతలతో భేటీ కానున్నారు.
ఈ మేరకు అందుబాటులో ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలు హైదరాబాద్ లోటస్ పాండ్ లోని నివాసానికి రావాలని ఆహ్వానించారు.అయితే కాంగ్రెస్ చేరిక అంశంపై పార్టీ శ్రేణులతో షర్మిల చర్చిస్తారని తెలుస్తోంది.
సమావేశం అనంతరం మధ్యాహ్నం షర్మిల కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయకు వెళ్లనున్నారన్న సంగతి తెలిసిందే.