డిసెంబర్ 29న బిహార్( Bihar )లోని మోతిహారి రోడ్లపై వెళుతూ ఓ విమానం ఫ్లైఓవర్ కింద ఇరుక్కుపోయింది.ఇది వినడానికి ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది కదూ.
నిజానికి ఆ ఫ్లైట్ మూలన పడింది.ఈ ఏరోప్లేన్ స్క్రాప్‌ను ముంబై నుంచి అస్సాంకు( Mumbai ) పెద్ద ట్రక్కులో ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నారు.
అయితే మార్గం మధ్యలో ఫ్లైట్ వంతెన కింద ఇరుక్కుపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.విమానం దాని ఎత్తు కారణంగా పిప్రకోఠి వంతెన గుండా వెళ్ళలేకపోయింది.
ట్రక్కు డ్రైవర్, స్థానికులు వంతెన నుంచి విమానాన్ని విడిపించడానికి ప్రయత్నించారు, కానీ అలా చేయడానికి చాలా గంటలు పట్టింది.ఇంతలో, చాలా మంది వ్యక్తులు సైట్ చుట్టూ గుమిగూడారు, విమానంతో ఫోటోలు, సెల్ఫీలు తీసుకున్నారు.జనాన్ని అదుపు చేయడంతోపాటు రోడ్డును క్లియర్ చేయడానికి పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
చివరగా, ట్రక్కు టైర్ల గాలిని తగ్గించి, విమానాన్ని వంతెన కింద నుంచి బయటకు వచ్చేలా చేశారు.ఘటనాస్థలం నుంచి విమానాన్ని సురక్షితంగా తొలగించడంతో పోలీసులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.ఫ్లైఓవర్ కింద ఇరుక్కుపోయిన విమానానికి సంబంధించిన వీడియోను వార్త సంస్థ ఏఎన్ఐ షేర్ చేసింది.
అందులో ట్రక్కుపై ఉన్న విమానం ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఉండటం చూడవచ్చు.ఆ విమానం ముందు భాగం బ్రిడ్జి కింద నుంచి వెళ్ళగలిగింది కానీ మధ్య భాగం స్ట్రక్ అయింది.
ఈ వీడియోకు 4 లక్షల దాక వ్యూస్ వచ్చాయి.భారతదేశంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు.2022, నవంబర్‌లో, ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా( Bapatla district )లో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది, కొచ్చి నుంచి హైదరాబాద్‌కు ట్రక్ ట్రైలర్‌లో తరలిస్తున్నప్పుడు అండర్‌పాస్‌పై విమానం ఇరుక్కుపోయింది.