సలార్ సినిమాకు అందుకే ఒప్పుకున్నాను.. ప్రభాస్ కామెంట్స్ వైరల్!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas ) తాజాగా నటించిన చిత్రం సలార్ ( Salaar ) ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విజయాన్ని సొంతం చేసుకుని భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది.ఇక ఈ సినిమా మూడు రోజులలోనే ఏకంగా 400 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

 Prabhas Interesting Comments About Salaar Movie , Prabhas, Salaar Movie ,-TeluguStop.com

సలార్ సినిమా మంచి సక్సెస్ కావడంతో ప్రభాస్ ఈ సినిమా విజయం పై స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా ప్రభాస్ ఏ సినిమా గురించి మాట్లాడుతూ మొదటి పార్ట్ లోనే రెండో పార్ట్ ఉంటుందని క్లారిటీ ఇచ్చాము కానీ రెండో పార్ట్ మొదటి పార్ట్ కన్నా చాలా అద్భుతంగా ఉండబోతుందని తెలిపారు.

Telugu Salaar, Bahubali, Prabhas, Prashanth, Rajamouli, Tollywood-Movie

ఇటీవల హాలీవుడ్ మీడియాతో మాట్లాడినటువంటి ప్రభాస్ ఈ విషయాలను వెల్లడించారు.అంతేకాకుండా సలాడ్ సినిమా చేయడానికి గల కారణాలను కూడా ఈయన ఈ సందర్భంగా వెల్లడించారు.సలార్ సినిమా నాకెంతగానో నచ్చింది ఈ సినిమా కథ వినగానే ఒప్పుకున్నానని తెలిపారు.ఇప్పటివరకు నేను చేసినటువంటి సినిమాలలో ఎంతో విభిన్నమైనటువంటి చిత్రం సలార్ అని ఈయన వెల్లడించారు.

ఈ సినిమా ఎంతో సవాల్ తో కూడుకున్నదని ప్రభాస్ తెలిపారు.

Telugu Salaar, Bahubali, Prabhas, Prashanth, Rajamouli, Tollywood-Movie

బాహుబలి( Bahubali ) సినిమా నా కెరియర్ కు ఒక బెంజ్ మార్క్ క్రియేట్ చేసింది ఈ సినిమా తర్వాత నేను ఎంపిక చేసుకునే సినిమాలలో కొత్తదనం ఉండేలా చూసుకున్నానని అందులో భాగంగానే ఈ సినిమాకి ఓకే చేశాను అంటూ ప్రభాస్ తెలిపారు.ప్రేక్షకులు కూడా రొటీన్ కంటెంట్ ఉన్న సినిమాలు కాకుండా సరికొత్త కథాంశంతో వచ్చే సినిమాలను ఇష్టపడుతున్నారని ఈయన తెలియజేశారు.రాజమౌళి ప్రశాంత్ ( Prashanth ) వంటి దర్శకులతో సినిమాలు చేయడం చాలా సంతోషంగా ఉందని ఈయన తెలిపారు.

ఇప్పుడు ప్రపంచం మొత్తం మన భారతీయ సినిమాల గురించి మాట్లాడుతున్నారని ఈ సినిమాలో టాలీవుడ్ బాలీవుడ్ అని తేడాలు లేకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని గుర్తిస్తున్నారు అందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఈ సందర్భంగా ప్రభాస్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube