అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన మొట్టమొదటి సినిమా జోష్( Josh ) మీకు గుర్తుందా ? నాగ చైతన్యను హీరోగా ఇంట్రడ్యూస్ చేయడంలో ఈ చిత్రం ఫెయిల్ అయినప్పటికీ ఆ సినిమాలోని కొన్ని పాయింట్స్ మాత్రం ప్రేక్షకులను బాగానే అలరించాయి.ముఖ్యంగా ఈ సినిమా యూత్ పై రాజకీయాల ప్రభావాన్ని స్పష్టంగా తెలిపే ప్రయత్నం చేసింది.
అంటే కాలేజీ లో రెండు గ్రూపుల మధ్య జరిగే రాజకీయ కొట్లాటల పై ఉంటుంది.కాగా ఈ సినిమాకు దర్శకత్వం వహించింది వాసు వర్మ.
నిర్మాతగా వ్యవహరించింది దిల్ రాజు.ఈ సినిమా గురించి చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే ఇందులో ఉండే ఒక పాట నిర్మాత దిల్ రాజు పాడాడు అనే సంగతి.
ఈ విషయం తెలిసిన తరువాత మీరు కూడా షాక్ కి గురి కావచ్చు.కానీ దిల్ రాజు( Dil Raju ) నిజంగానే పాట పాడాడు.ఈ విషయాన్ని బయట పెట్టింది మరెవరో కాదు టాలీవుడ్ దిగ్గజ దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు( Raghavendra Rao ).ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన దిల్ రాజు జోష్ సినిమాలో పాట పాడాడు అనే విషయాన్ని బయట పెట్టాడు.అప్పటి వరకు ఆ విషయం ఎవరికీ తెలియదు.దాంతో అతను పాడిన పాట ఏంటి అని సెర్చింగ్ మొదలైంది.అది మరేదో కాదు అన్న వచ్చినాడు అంటూ జేడీ చక్రవర్తి పై కాలేజీ యువత పాడుకునే పాట.ఈ పాట అప్పట్లో బాగానే వైరల్ అయింది కానీ సినిమాకి కలెక్షన్స్ తేవడంలో మాత్రం వర్కౌట్ అవలేదు.
నిజానికి దిల్ రాజు కి పాటల విషయంలో మంచి అభిరుచి ఉంటుంది.ఆయన తీసే అన్ని సినిమాలలో పాటలు బాగా ఉండడానికి వీలైనంత కసరత్తు చేయడంలో దిల్ రాజుకు మించిన వారు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే లేరు ఆయనకు పాటలు పాడటం కూడా అంతే ఇష్టం ఆ అభిరుచి తెలిసిన దర్శకుడు వాసు వర్మ దిల్ రాజుకి బలవంతం చేయడంతో తప్పక ఆయన ఆ పాట పాడాడు మీరు కూడా ఇప్పుడు ఆ పాట వింటే పాడింది దిల్ రాజు అని గుర్తించే అవకాశం ఉండదు.అంత వేరియేషన్ కనిపిస్తోంది.