తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న డైరెక్టర్లు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోడానికి చాలా కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి హీరోలతోనే ఎక్కువ సినిమాలు చేయడం వెనక అసలైన కారణం ఏమిటి అంటే త్రివిక్రమ్ రాసుకున్న కథలకి వేరే హీరోలని అప్రోచ్ అయి వాళ్ళతో చేసే కంటే తనకు మంచిర్యాపో ఉన్న హీరోలతో సినిమాలు చేస్తేనే బాగా వర్కౌట్ అవుతుంది అని అనుకునే స్వభావం కలిగిన వ్యక్తి.

అందుకే ఆయన ఎవరితో అయితే ఎక్కువగా చనువుగా ఉంటాడో వాళ్లతోనే ఎక్కువ సినిమాలు చేయడానికి ఇష్టపడుతుంటాడు.ఇక అందులో భాగంగా ఆయన ఈ నలుగురు స్టార్ హీరోలతోనే చాలా క్లోజ్ గా ఉంటారు కాబట్టి వీళ్లతో ఎక్కువ సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు.ఇక ఇప్పుడు మహేష్ బాబుతో గుంటూరు కారం ( Guntur Kaaram (అనే సినిమా చేస్తూన్నారు.

2024 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలని ఉద్దేశ్యం లో ఆ సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నారు.ఇక ఈ సినిమాతో మరోసారి ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది.ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో ఇంతకు ముందు వచ్చిన రెండు సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు.
దాంతో ఈ సినిమాతో మహేష్ బాబుకి మంచి బ్లాక్ బాస్టర్ హిట్టు ఇవ్వాలని తను కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది.ఇక అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడం పక్కా అని మహేష్ బాబు( Mahesh Babu ) అభిమానులు ఆశ భావన వ్యక్తం చేస్తున్నారు…ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ అల్లు అర్జున్ తో మరో సినిమా చేయబోతున్నాడు త్రివిక్రమ్…
.