స్త్రీల నుంచి పురుషుల వరకు చాలా మంది దట్టమైన కురుల కోసం ఆరాటపడుతుంటారు.జుట్టు ఒత్తుగా ఉంటే లుక్ మరింత అట్రాక్టివ్ గా కనిపిస్తుంది.
అందుకే జుట్టును ఒత్తుగా మార్చుకునేందుకు చాలా ప్రయత్నిస్తుంటారు.ఖరీదైన ఆయిల్, షాంపూ, సీరం వంటివి వాడుతుంటారు.
జుట్టు విషయంలో రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.ఎన్ని చేసినా కూడా ఎలాంటి ఫలితం కనిపించడం లేదా.? అయితే అస్సలు చింతించకండి.దట్టమైన కురులను అందించడానికి దాల్చిన చెక్క అద్భుతంగా తోడ్పడుతుంది.
దాల్చిన చెక్క లో ఉండే ప్రత్యేకమైన పోషకాలు కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.అదే సమయంలో జుట్టు రాలడాన్ని అడ్డుకుంటాయి.
మరి ఇంతకీ దాల్చిన చెక్క( Cinnamon )ను జుట్టుకు ఎలా ఉపయోగించాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు దాల్చిన చెక్క పొడిని( Cinnamon powder ) వేసుకోవాలి.ఆ తర్వాత నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె లేదా ఆవ నూనె లేదా నువ్వుల నూనె వేసుకుని బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతి వేళ్లతో స్కాల్ప్ కు బాగా అప్లై చేసి కనీసం ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ఆపై షవర్ క్యాప్ ధరించాలి.
నలభై నిమిషాల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.
వారానికి రెండంటే రెండు సార్లు ఈ విధంగా చేస్తే జుట్టు రాలడం( Hair loss ) తగ్గుతుంది.ఊడిన జుట్టు మళ్ళీ మొలుస్తుంది.కురులు దట్టంగా పెరిగేలా ఈ రెమెడీ ప్రోత్సహిస్తుంది.
తక్కువ సమయంలోనే ఒత్తైన జుట్టును అందిస్తుంది.అంతే కాదు చుండ్రు సమస్యతో బాధపడే వారికి కూడా దాల్చిన చెక్క ఎంతో మేలు చేస్తుంది.
పైన చెప్పిన విధంగా దాల్చిన చెక్కని వాడితే చుండ్రు( Dandruff ) దెబ్బకు మాయం అవుతుంది.స్కాల్ప్ లోతుగా శుభ్రమై.
హెల్తీ గా మారుతుంది.