సింగపూర్ కార్మిక సంఘాల సమాఖ్య అధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ.. ఎవరీ ధనలెచ్చిమి..?

సింగపూర్‌లో( Singapore ) భారత సంతతి మహిళ అరుదైన ఘనత సాధంచారు.దేశంలోని అతిపెద్ద లేబర్ గ్రూప్ ‘‘ నేషనల్ ట్రేడ్స్ యూనియన్ కాంగ్రెస్ ’’( National Trades Union Congress ) అధ్యక్షురాలిగా కె ధనలెచ్చిమి( K Thanaletchimi ) నియమితులయ్యారు.నేషనల్ ట్రేడ్స్ యూనియన్ కాంగ్రెస్ (ఎన్‌టీయూసీ) 58 అనుబంధ సంఘాల నుంచి దాదాపు 450 మంది ప్రతినిధులు గురువారం రహస్య బ్యాలెట్ విధానంలో ఆమెను ఎన్నుకున్నారు.2027 వరకు నాలుగేళ్ల పాటు ధనలెచ్చిమి విధులు నిర్వర్తించనున్నారు.58 ఏళ్ల ధనలెచ్చిమి మేరీ లీవ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.

 Indian-origin Healthcare Unionist K Thanaletchimi Elected President Of Singapore-TeluguStop.com

కార్మికుల కాంపాక్ట్‌ను పునరుద్ధరించామని చెప్పారు.కొత్త సెంట్రల్ కమిటీతో కార్మికుల ప్రయోజనాలను కొనసాగించడం, వారి వేతనాలు, సంక్షేమం, పని అవకాశాలను మెరుగుపరచడం లక్ష్యంగా పనిచేస్తానని ధనలెచ్చిమి చెప్పారు.

Telugu Indian Origin, Thanaletchimi, Mary Liew, Nationaltrades, Ntuc, Singapore,

కాగా.రెండు పర్యాయాలు అధ్యక్షురాలిగా పనిచేసిన అనంతరం మేరీ లీవ్( Mary Liew ) ఈసారి పోటీ నుంచి తప్పుకున్నారు.ఎన్‌టీయూసీ( NTUC ) దాని నాయకులు 62 ఏళ్లు నిండిన తర్వాత యువ నాయకత్వానికి అవకాశం ఇచ్చేందుకు గాను పదవీ విరమణ చేయాల్సి వుంటుంది.బుధ, గురువారాల్లో ఎన్‌టీయూసీ జాతీయ ప్రతినిధుల సదస్సులో కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగింది.

ఎన్‌టీయూసీ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జాతీయ ప్రతినిధుల సదస్సును నిర్వహిస్తుంది.

Telugu Indian Origin, Thanaletchimi, Mary Liew, Nationaltrades, Ntuc, Singapore,

ధనలెచ్చిమి ( Thanaletchimi ) ఈ యూనియన్‌లో పలు హోదాల్లో పనిచేశారు.2016 నుంచి 2018 వరకు పార్లమెంట్‌కు నామినేటెడ్ సభ్యురాలిగా వ్యవహరించారు.1998లో నేషనల్ యూనివర్సిటీ హాస్పిటల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షురాలిగా ధనలెచ్చిమి ఎన్నికయ్యారు.హెల్త్ కార్పోరేషన్ ఆఫ్ సింగపూర్ స్టాఫ్ యూనియన్‌లో విలీనం కావడంలో ఆమె కీలకపాత్ర పోషించినట్లు ఎన్‌టీయూసీ తెలిపింది.తద్వారా 2006లో హెల్త్‌కేర్ సర్వీసెస్ ఎంప్లాయిస్ యూనియన్ విజయవంతంగా ఏర్పడటానికి వెసులుబాటు కల్పించింది.2011 నుంచి దీనికి ధనలెచ్చిమి అధ్యక్షురాలిగా వున్నారు.ఆమె తొలిసారిగా అక్టోబర్ 2015లో ఎన్‌టీయూసీ కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు.2019లో ఈ సంస్థ ఉపాధ్యక్షురాలి స్ధాయికి చేరుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube