కమల్ హాసన్ నటించిన ఆ సినిమాకి విక్టరీ వెంకటేష్ దర్శకత్వం వహించాడా..? ఎవరికీ తెలియని షాకింగ్ నిజం!

మన టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్( Venkatesh ) కి నటుడిగా, ఒక వ్యక్తిగా ఎంత గొప్ప పేరుందో మన అందరికీ తెలిసిందే.ఇండస్ట్రీ లో ప్రతీ హీరో కి అభిమాని ఉండొచ్చు.

 Did Victory Venkatesh Direct The Movie Starring Kamal Haasan The Shocking Truth-TeluguStop.com

కానీ వెంకటేష్ కి తన అభిమానులతో పాటుగా, ఇతర హీరోల అభిమానులు కూడా అభిమానిస్తారు.కామెడీ, సెంటిమెంట్, మాస్ మరియు యాక్షన్ ఇలా ఏ జానర్ తీసుకున్నా వెంకటేష్ కి బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి.

ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఫ్యామిలీ డ్రామా సినిమాలు అంటే గుర్తుకు వచ్చే మొట్టమొదటి హీరో విక్టరీ వెంకటేష్.ఈ సినిమా విడుదల అవుతుందంటే చాలు, ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం థియేటర్స్ ముందు క్యూలు కడుతారు.

ఇప్పటికీ కూడా ఏ హీరోకి అయినా మంచి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్టు వచ్చిందంటే వెంకటేష్ తో పోల్చి చూస్తారు.తెలుగు ఆడియన్స్ లో ఆయన వేసుకున్న ముద్ర అలాంటిది.

Telugu Eenadu, Kamal Haasan, Kollywood, Mohanlal, Poonam Kaur, Tollywood, Venkat

అలాంటి వెంకటేష్ ఇప్పటి వరకు నటుడిగా మాత్రమే మన అందరికీ పరిచయం కానీ, ఆయన ఒక సినిమాకి దర్శకత్వం వహించాడని, అది కూడా కమల్ హాసన్ లాంటి లెజెండ్ నటించిన సినిమాకి అని చాలా మందికి తెలియదు.పూర్తి వివరాల్లోకి వెళ్తే 2009 వ సంవత్సరం లో కమల్ హాసన్ మరియు వెంకటేష్ కాంబినేషన్ లో ‘ఈనాడు’ అనే చిత్రం( Eenadu ) వచ్చింది.ఈ సినిమా అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది.కథ మొత్తం ఒకే పాయింట్ మీద తిరగడం తో ఆడియన్స్ పెద్దగా ఈ సినిమాపై ఆసక్తి చూపలేదు.

ఈ చిత్రానికి చక్రి తోలేటి దర్శకత్వం వహించాడు.ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లోనే బాలీవుడ్ లో చక్రి కి మరో సినిమాకి దర్శకత్వం వహించే ఛాన్స్ దక్కింది.

ఒక షెడ్యూల్ మొత్తానికి ఆయన దర్శకత్వం వహించలేకపోయాడు.

Telugu Eenadu, Kamal Haasan, Kollywood, Mohanlal, Poonam Kaur, Tollywood, Venkat

కమల్ హాసన్( Kamal Haasan ) డేట్స్ కూడా ఆ షెడ్యూల్ కి అందుబాటులో లేవు, దీంతో వెంకటేష్ ఆ షెడ్యూల్ లో కేవలం తానూ ఉన్న సన్నివేశాలను ప్లాన్ చేసి, వాటికి ఆయనే దర్శకత్వం కూడా చేసాడట.అలా దాదాపుగా రెండు వారాల షూటింగ్ కేవలం వెంకటేష్ దర్శకత్వం లోనే జరిగిందట.సినిమా మొత్తం చూసేందుకు బాగుంటుంది కానీ, కమర్షియల్ గా వర్కౌట్ అయ్యే సినిమా కాదని చూసిన ప్రతీ ఒక్కరికి అర్థం అవుతుంది.

ఈ సినిమాలో తెలుగు మరియు తమిళం భాషల్లో తెరకెక్కింది.రెండిట్లోనూ కమల్ హాసన్ నటించాడు, కానీ తమిళం లో వెంకటేష్ పాత్రని మోహన్ లాల్ చేసాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube