నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.పుష్ప (Pushpa ) సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక రష్మిక నటించిన తాజా చిత్రం యానిమల్( Animal ) .బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ( Ranbir Kapoor ) హీరోగా సందీప్ రెడ్డి ( Sandeep Reddy ) వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ విడుదల కాబోతుంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం బాలకృష్ణ ( Balakrishna ) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్( Un Stoppable ) కార్యక్రమానికి హాజరైన సంగతి తెలిసిందే.

నేడు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎపిసోడ్ ప్రసారం అయింది.ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో పాటు రష్మిక రణబీర్ కపూర్ హాజరైన సంగతి తెలిసిందే.బాలకృష్ణ రణబీర్ కపూర్ సందీప్ రెడ్డిని ప్రశ్నిస్తూ రష్మికను షూటింగ్ లేని సమయంలో కలవాలి అంటే ఎక్కడ కలవాలి ఆమె ఎక్కడ మనకు చాలా సులభంగా దొరుకుతుంది షూటింగ్ లేకపోతే రష్మిక ఎక్కడికి వెళుతుంది అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు సందీప్ రెడ్డి అలాగే రణబీర్ కపూర్ ఇద్దరు కూడా ఒకే సమాధానం చెప్పారు.

రష్మిక తన సినిమా షూటింగ్ పనులలో బిజీగా గడుపుతూ ఉంటుందని ఒకవేళ తనకు సినిమా షూటింగ్ కనుక లేకపోతే ఆమె జిమ్ లో ఉంటుందని అక్కడికి వెళ్తే మనం తప్పకుండా తనని కలవచ్చని ఆమె మనకు దొరికేది అక్కడే అంటూ సమాధానం చెప్పారు.సినిమా షూటింగ్స్ లేకపోతే ఈమె వర్క్ ఔట్స్ చేస్తూ జిమ్ లో బిజీగా గడుపుతుంటారని ఈ సందర్భంగా వీరిద్దరూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్స్ రష్మిక ఏ జిమ్ కి వెళ్తుంది అంటూ నెటిజన్స్ పెద్ద ఎత్తున గూగుల్ సెర్చ్ చేస్తున్నారు.