ముంబై వాసుల జీవితంలో లోకల్ ట్రైన్( Mumbai Local Train ) ఒక అంతర్భాగంగా మారింది.స్కూల్ నుంచి కాలేజీ వరకు, కూలి పని నుంచి ఐటీ ఆఫీస్ వరకు వెళ్లే ప్రతి ఒక్కరూ ఈ లోకల్ రైళ్లపైనే ఆధారపడుతున్నారు.
ఈ ట్రైన్స్ కాళ్లు పెట్టుకోవడానికి కూడా ఖాళీ లేని విధంగా రోజూ నిండిపోతాయి.ఉంది.
ఈ ట్రైన్లలో ఊపిరి కూడా ఆడే పరిస్థితి ఉండదు.అలాంటి బిజీ ట్రైన్‌లోని ఓ బోగీలో ఇద్దరు వ్లాగర్లు స్మాల్, టెంపరరీ రెస్టారెంట్‌ను ఓపెన్ చేసి ప్యాసింజర్లను ఆశ్చర్యపరిచారు.
లోకల్ ట్రైన్‌లో రెస్టారెంట్( Local Train Restaurant ) ఐడియా గురించి తెలుసుకుని నెటిజన్లు కూడా అబ్బురపడ్డారు.
వైరల్ వీడియోలో, ఇద్దరు వ్లాగర్లు ముంబై లోకల్‌లో ఫైవ్ స్టార్ రెస్టారెంట్‌ను ఓపెన్ చేస్తున్నామని చెప్పడం చూడవచ్చు.‘టేస్టీ టికెట్’( Tasty Ticket ) పేరుతో ఈ రెస్టారెంట్ గురించి ప్యాసింజర్లకు తెలుపుతూ వారు ప్రచారం చేశారు.రెస్టారెంట్‌కి సంబంధించిన వివరాలతో ఒక పోస్టర్ లేదా ఇన్విటేషన్ కార్డు ప్యాసింజర్లకు అందిస్తూ వారు ఆశ్చర్యపరిచారు.
రెస్టారెంట్ ఓపెనింగ్‌లో ప్రజలకు ఫ్రీ ఫుడ్ అందజేస్తామని చెప్పారు.మామూలు ఫుడ్ కాకుండా ఏకంగా ఫైవ్ స్టార్ రెస్టారెంట్ ఫుడ్ ఆఫర్ చేస్తామని కూడా తెలిపారు.
ఇన్విటేషన్ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేశాక యువకులు లోకల్ ట్రైన్‌లోని ఒక కోచ్‌లో ఫుడ్ టేబుల్‌ను ఏర్పాటు చేయడం వీడియోలో మీరు చూడవచ్చు.ఆ తర్వాత ప్రయాణికులకు ఫుడ్ పెట్టడం ప్రారంభించారు.ఆ సమయంలో వారు రెస్టారెంట్ స్టాఫ్ వలె సర్వెంట్ల డ్రెస్సులు వేసుకొని కనిపించారు.ఇద్దరు ప్రయాణికులకు జిలేబీ, కెచప్‌తో మ్యాగీ, స్వీట్ డెజర్ట్ కూడా సర్వ్ చేశారు.
అనంతరం ప్రయాణికుల ఫీడ్ బ్యాక్ అడిగి మరీ తెలుసుకున్నారు.ఆ ఫుడ్ తిన్న ప్రయాణికులు సర్వీస్ తో పాటు ఫుడ్ కూడా సూపర్ గా ఉందని తెలిపారు.
అయితే ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తూ ఉంది.దీన్ని మీరు కూడా చూసేయండి.