ఇరాన్ ప్రెసిడెంట్ తో ఫోన్ లో సంభాషించిన మోదీ..!!

గత నెల అక్టోబర్ 7వ తారీకు నుండి ఇజ్రాయెల్( Israel ).హమాస్ మిలిటెంట్ ల మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.

 Modi Had A Phone Conversation With The President Of Iran, Modi, Iran, Israel, H-TeluguStop.com

ఈ యుద్ధంలో చాలామంది సామాన్యులు మరణిస్తున్నారు.యుద్ధం మొదలై రేపటితో నెల రోజులుగా కావస్తున్న క్రమంలో దాదాపు 11 వేల మంది మరణించినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

హమాస్ ఉగ్రవాదులు గాజా పట్టణంలో ఉండటంతో ఇజ్రాయెల్.బీకరమైన దాడులు చేస్తూ ఉంది.

ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తూ ఉంది.అయితే ఎక్కువగా ఉగ్రవాదులు సొరంగాలలో తలదాచుకోవటంతో.

ఇజ్రాయెల్ సైనికులకు యుద్ధం చాలా కష్టతరంగా మారింది.

మరోపక్క ఇజ్రాయెల్.

దాడులు ఆపాలని అరబ్ దేశాలు కోరుతున్నాయి.మరికొన్ని దేశాలు ఇజ్రాయెల్ పై యుద్ధం కూడా ప్రకటించాయి.

ముఖ్యంగా ఇరాన్ .గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఖండిస్తూ ఉంది.ఈ క్రమంలో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ( Prime Minister Narendra Modi ).ఇరాన్ ప్రెసిడెంట్ సయ్యద్ ఇబ్రహీం రైసీతో ఫోన్ లో సంభాషించడం జరిగింది.గాజాలో నెలకొన్న యుద్ద పరిస్థితులు.మానవతా సాయం పై ఇద్దరు చర్చించుకోవడం జరిగింది.యుద్ధంలో సామాన్యులు మరణించడం పట్ల మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ క్రమంలో బాధితులకు ఏ రకంగా సహాయం చేయాలి అనే అంశంపై ఇరాన్ ప్రెసిడెంట్ సయ్యద్ ఇబ్రహీం రైసీతో మోదీ చర్చ జరిపారట.

ఇదే సమయంలో ఇరాన్.భారత్ ద్వైపాక్షిక సంబంధాలపై కూడా వీరు చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube