రసాయన మందులను పిచికారి చేసే సమయంలో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు..!

ప్రస్తుత పరిస్థితులలో వ్యవసాయంలో( agriculture ) అధిక దిగుబడులు సాధించడం కోసం విచక్షణారహితంగా రసాయన పిచికారి మందులను అధిక మొత్తంలో ఉపయోగిస్తున్నారు.ఫలితంగా పండిన పంటలో నాణ్యత అనేది లేకుండా పోతుంది.

 Precautions To Be Taken By Farmers While Spraying Chemicals , Chemical, Agric-TeluguStop.com

వ్యవసాయం చేసే రైతులకు( Farmers ) ఏ సమయంలో రసాయన మందులు కొట్టాలి.ఎంత మోతాదులో పురుగుమందును కొట్టాలి.

అసలు పురుగుమందు కొట్టాల్సిన అవసరం కచ్చితంగా ఉందా అనే విషయాలపై అవగాహన తప్పనిసరి.చీడపీడల నివారణకు రసాయన పిచికారి మందులు కాకుండా వేరే పద్ధతులు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.

Telugu Agriculture, Chemical, Farmers, Spray-Latest News - Telugu

పంట ఏదైనా రసాయన మందులను పిచికారి చేసే ముందు చీడపీడల( Pests ) వల్ల పంటకు నష్టం ఎంత ఉందో ముందు అంచనా వేయాలి.నష్ట శాతం ఆర్థిక పరిమితి స్థాయిని దాటినప్పుడు మాత్రమే రసాయనం మందులు పిచికారి చేయాలి.అంటే పొలంలో పది శాతం మొక్కలు నష్ట పోయినప్పుడు మాత్రమే రసాయనాలు పిచికారి చేయాలి.పిచికారి మందులను అవసరం అయినంత మేరకే కొనుగోలు చేసి, అవసరం అయినంత మేరనే కొంతకు పిచికారి చేయాలి.

ఏ మందులు కొనుగోలు చేసిన ఎక్స్పైరీ తేదీ, తయారుచేసిన తేదీ, బ్యాచ్ నెంబర్, బిల్లు ఒకసారి చెక్ చేసుకోవాలి.

Telugu Agriculture, Chemical, Farmers, Spray-Latest News - Telugu

రసాయన పిచికారి మందులను ఉపయోగించే సమయంలో తప్పకుండా పాటించాల్సిన జాగ్రత్తలు: స్ప్రే దావకం( Spray application ) తయారీకి పరిశుభ్రమైన నీరుని ఉపయోగించాలి.అవసరం అయినంత మేరకే స్ప్రే దావకం తయారు చేసుకోవాలి.స్ప్రే ద్రావకం తయారీ బకెట్ లేదా డ్రమ్ములో తయారు చేయాలి.

ద్రావకాన్ని చేతులతో కాకుండా ఒక కర్రతో కలపాలి.ద్రావకం తయారు చేసేటప్పుడు నీరు తాగడం, పొగ త్రాగడం( smoking ), గుట్కా నమ్మడం లాంటి పనులు చేయకూడదు.

ద్రావకం పోసే ముందే స్పేయర్ యొక్క పనితీరును పరీక్షించాలి.స్పేయర్ లో ద్రావకం పోసేటప్పుడు ఒలికిపోకుండా చూడాలి.

ఎట్టి పరిస్థితులలో స్ప్రే చేసేటప్పుడు వాసన చూడకూడదు.చేతులు, చెవులు, నోరు, కళ్ళు, ముక్కులకు రక్షణ ఏర్పాటు చేసుకోవాలి.

గాలి ఎక్కువగా వీస్తున్న సమయంలో స్ప్రే చేయకూడదు.ఉదయం లేదా సాయంత్రం మాత్రమే పంటకు స్ప్రే చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube