సిరిసిల్ల అభివృద్ధిని చూసి ఓటు వేయండి

బిఆర్ఎస్ పార్టీ యువ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం హాజరై ప్రసంగించిన కేటీఆర్.రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం పద్మనాయక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ ( BRS party ) “యువ ఆత్మీయ సమ్మేళనం” కార్యక్రమంనకు హాజరైన బిఆర్ ఎస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థి కేటీఆర్.

 Watch And Vote For Sirisilla's Development , Brs Party, Ktr ,sirisilla-TeluguStop.com

సమావేశానికి హాజరైన కేటీఆర్ కు గధ, ఖడ్గం సమర్పించిన పట్టణ యువకులు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ యువకులు మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గం నుండి లక్ష మెజార్టీ తో కేటీఆర్ ను గెలిపించుంటామన్నారు.

అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ప్రతి రోజు దిన చర్య స్టార్ట్ ఆయ్యేది సోషల్ మీడియా ఫోన్ తోనే,సోషల్ మీడియా లో వచ్చేవి ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చుపెడుతున్నరు.వాటితోనే మనం సమాధానం చేపుతామన్నారు.2014 సిరిసిల్ల ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అవిటి తోనే ప్రచారం చేస్తూ సెల్ఫీలు పెట్ట ప్రచారం చేయాలి.నేను ప్రజలకు పనికొచ్చే మనిషిని పనే చేసే మనిషిని నా నమ్మకం మీరు.

ప్రజలకు ఇష్టమైన మనిషిని ఎన్నుకుంటారు.తులం బంగారం ఇచ్చిన నచ్చిన వారినే ఓటు వేసి గెలుపిస్తారు.

సిరిసిల్ల లో మెడికల్, కేజీ టూ పీజీ, నర్సింగ్ కాలేజీ, వ్యవసాయ కాలేజీ లు ఏర్పాటు చేశామన్నారు.అన్ని అభివృద్ధి సిరిసిల్ల, సిద్దిపేటలో జరిగాయన్నారు.

అభివృద్ధి చూసి ఓటు వేయండి అని ప్రజలకు సూచించారు.ఒకప్పుడు బతుకమ్మ అడుకోవాలంటే ఒక కోలను తవ్వి బతుకమ్మలు వేసుకున్నాం.

ఇప్పుడు 24 గంటలు తంగాల్లపల్లి బ్రిడ్జి కింద నీళ్లు ఉన్నాయి.సాగు నీటిని లో ఒక విప్లవం.400 కోట్లతో వర్క్ ర్ టూ ఓనర్ చేస్తున్నాం.షెడ్లు కడుతున్నమన్నారు .అప్పెరల్ పార్క్ లో రెండు యూనిట్ల స్టార్ట్ అయ్యాయి.హక్వ హబ్ ఏర్పాటు చేశామన్నారు.

నాకు కులం మతం లేదు తొమ్మిదిన్నర ఏళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేశాను అభివృద్ధి కి ఎప్పుడు కులం మతం ఉండదు.కులం పేరు మీద మతం పేరుమీద అభివృద్ధి నా కులం.14 న్నర ఏళ్లుగా మి ముందు ఉన్ననని,తెలంగాణ సాధన కోసం జైల్ పోయానని అన్నారు.కెసిఆర్ దయతో నేను మంత్రి నీ అయ్యాను.ఏ దేశం పోయిన నేను గర్వంగా చెప్పుకుంటారు సిరిసిల్ల అని.14 న్నార ఏళ్లుగా ముందు ఉన్నాను నేను ఎలా పని చేశానో చూసి ఓటు వేయండి.మీ తల రాత రాసే నాయకుడు ఎవరనేది చూసి ఓటు వేయండి అని అన్నారు.అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి ఆడ పిల్లను ఇస్తాం.

అలా ఆలోచన చేసిన తర్వాత ఓటు వేయండి.అన్ని రాష్ట్రాలకు సీఎం ఉంటాడు కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కెసిఆర్ సీఎం గా ఉన్నాడు.

ఆనాడు కాంగ్రెస్ పార్టీ నీ బర్కష్ చేయండి అని గాందీ అన్నాడు.ఇక్కడ ఓటు కు నోటు దొంగ అదే కాంగ్రెస్ కు నాయకుడు గా ఉన్నాడు.

అమర వీరుల త్యాగలతో రాష్ట్రం సాధించుకున్నాం కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఇవ్వలేదు.కాంగ్రెస్ కు 11 సార్లు అవకాశం ఇచ్చినం ఈ దగాకొర్లకు అని తెలిపారు.

యువత సోషల్ మీడియా ద్వారా బారాసా పార్టీకి పని చేయండి అని దిక్సూచి చేశారు.మాకు కెసిఆర్, కేటీఆర్ ఉన్నారు అభివృద్ధి చేయడానికి ఓట్లు అడిగే వారీకి చెప్పండి అని యువతకు సందేశాన్ని ఇచ్చారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube