తెలుగు సినిమా ఇండస్ట్రీలో వస్తున్న చాలా సినిమాల్లో ప్రస్తుతం ఏ సినిమా కూడా ప్రేక్షకుడిని విపరీతం అలరించడం లేదు.అన్ని నాసిరకమైన సినిమాలే వస్తున్నాయి.
ఇక ఈ మధ్య చిన్న సినిమాగా వచ్చి మంచి విజయం సాధించిన మాడ్ సినిమా( Mad movie ) లాంటి సినిమాలు ఎందుకు హిట్ అవుతున్నాయో కూడా ఎవ్వరికీ తెలియడం లేదు.ఎందుకంటే ఈ సినిమాలు ఇంతకుముందు కాలేజీ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన కథలతో ఉన్నటువంటి సినిమాలే అయిన కూడా యూత్ ప్రేక్షకులను ఈ సినిమాలు విపరీతంగా అలరిస్తున్నాయి.
నిజానికి ఈ సినిమాలో పెద్దగా చెప్పుకునే కొత్త పాయింట్ ఏం లేకపోయినప్పటికీ ఈ సినిమా అనేది చాలా మంది ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసింది.కాబట్టి సినిమా సక్సెస్ అయిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.కానీ ఈ సినిమాలో కొత్తదనం ఏమీ లేకపోతే ఈ సినిమాలని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారు అనేది ఇక్కడ చర్చ నీయంశం గా మారింది.ముఖ్యంగా ఇప్పుడు సినిమాల్లో బూతులు ఎక్కువగా ఉండటం వల్ల యూత్ బాగా వాటికి అట్రాక్ట్ అవుతున్నారు.
అందుకే ఇప్పుడు వచ్చే సినిమాల్లో డైరెక్టర్లు కంటెంట్ కంటే కూడా బూతులు, వల్గర్ సీన్ లు ఎక్కువ గా ఉండేలా డిజైన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
అయిన చాలామంది పెద్ద డైరెక్టర్లు సైతం ఇప్పుడు సినిమాల్లో కథలు ఏమీ ఉండడం లేదు ఒకప్పుడు వచ్చిన కథలనే మళ్లీ ఫ్రెష్ గా ఇప్పుడు తీస్తున్నారు అంతే తప్ప కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు ఏమీ రావడం లేదు ఇక ఇప్పుడు వస్తున్న సినిమాల కాన్సెప్ట్ లు అన్ని కూడా ఒకప్పుడు వచ్చి మంచి సక్సెస్ సాధించినవే అని చాలామంది డైరెక్టర్లు( Directors ) చెబుతున్నారు.అంటే ఇప్పుడున్న డైరెక్టర్లకి సినిమాలు తీయడం రాదా అని మరి కొందరు వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు…
.