న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్( Mayor Eric Adams )బుధవారం పీపుల్స్ హౌస్‌లో హిందూ సమాజంతో కలిసి దీపావళిని జరుపుకున్నారు.దీపావళి అంటే చీకటిని పారద్రోలి ప్రపంచానికి వెలుగునిచ్చే సమయం అని ఆయన ఎక్స్‌లో (గతంలో ట్విట్టర్) ఓ పోస్ట్ చేశారు.“దీపావళి కేవలం హాలిడే మాత్రమే కాదు.చీకటిని తొలగించి వెలుగులోకి రావాలని ఇది మనందరికీ గుర్తుచేస్తుంది.
హిందూ సమాజంతో ఈ పండగను జరుపుకోవడం గర్వంగా ఉంది.వారికి అండగా నిలబడటం కూడా గర్వంగా ఉంది.ప్రత్యేక దీపావళి వేడుకల కోసం మేం వారిని పీపుల్స్ హౌస్‌కి స్వాగతించాం.” అని మేయర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో, ఆడమ్స్ ( Mayor Eric Adams )ప్రపంచ వివాదాల నేపథ్యంలో శాంతి, సామరస్య ఆవశ్యకత గురించి కూడా మాట్లాడారు.“మనం రోజూ చాలా చీకటిని చూస్తూ ఉన్నాం.కాబట్టి మనం నిజంగా రామాయణాన్ని విశ్వసిస్తే, సీత జీవితాన్ని నిజంగా విశ్వసిస్తే, గాంధీ జీవితాన్ని నమ్మితే, తప్పక గాంధీ నడిచిన మార్గంలో నడవాలి.వారి ఆరాధకులుగా మాత్రమే కాదు అభ్యాసకులుగా కూడా ఉండాలి.” అని ఆడమ్స్ తెలిపారు.
2024 నుంచి న్యూయార్క్ నగరంలో దీపావళి ( Diwali )స్కూల్స్ కి హాలిడే ఇస్తామని ఆడమ్స్ ఇంతకుముందే జూన్‌లో ప్రకటించారు.చీకటిపై వెలుగు సాధించిన విజయానికి గుర్తుగా ఏటా దీపావళిని జరుపుకునే స్థానిక కుటుంబాలకు ఇది పెద్ద విజయమని ఆడమ్స్అన్నారు.ఇకపోతే ఈ సంవత్సరం, దీపావళి నవంబర్ 12న జరుపుకుంటారు.
ఈ సందర్భంగా న్యూయార్క్ నగరంలో ( New York City )విద్యార్థులు పాఠశాలకు సెలవు ఇవ్వడం ఇదే మొదటిసారి.