బాలకృష్ణ పై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సీరియస్ వ్యాఖ్యలు..!!

వైసీపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు( YCP Minister Karumuri Nageshwara Rao ) టీడీపీ ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.నేడు బాలకృష్ణ కొత్త సినిమా “భగవంత్ కేసరి”( Bhagavanth Kesari ) విడుదల కావడం జరిగింది.

 Ycp Minister Karumuri Nageshwara Rao Serious Comments On Balakrishna, Ysrcp, Min-TeluguStop.com

దీంతో చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో బాలకృష్ణ సినిమాలను ఎందుకు ఆపకుండా విడుదల చేశారు అని మంత్రి కారుమూరి ప్రశ్నించారు.తెలుగుదేశం పార్టీ క్యాడర్( TDP Cadre ) అంతా బాధలో ఉంటే బాలకృష్ణ తన సినిమాను ఎలా విడుదల చేశారని నిలదీశారు.

మరి అలాంటప్పుడు ప్రజలు ఎందుకు రోడ్లపైకి వచ్చేందుకు నిరసన తెలపాలని ప్రశ్నించారు.నిజంగా చంద్రబాబు అరెస్టు( Chandrababu Arrest ) అంత బాధ కలిగించి ఉంటే హెరిటేజ్ ను ఎందుకు ముయ్యలేదు చెప్పాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు కోసం హెరిటేజ్ ముయరు, బాలకృష్ణ( Balakrishna ) తన సినిమాని ఆపెయ్యరు.కానీ ప్రజలు మాత్రం రోడ్లపైకి రావాలా అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో బీసీలకు జగన్ ప్రభుత్వం ఎన్నో మేలులను చేసిందని వివరించారు.చంద్రబాబు హయాంలో బీసీలను మోసం చేశారని ఆరోపించారు.జగన్ హయాంలో స్కీములు ఉంటే చంద్రబాబు హయంలో స్కాములు జరిగాయని పేర్కొన్నారు.చంద్రబాబును ఆంధ్రాలో అరెస్టు చేస్తే హైదరాబాదు( Hyderabad )లో గొడవలు ఏమిటనీ ప్రశ్నించారు.

చట్టం ముందు అందరూ సమానమే అని అన్నారు.త్వరలో నిర్వహించబోయే బస్సు యాత్ర ద్వారా వైసీపీ ప్రభుత్వం వచ్చాక జరిగిన మంచిని ప్రజలకు వివరిస్తామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube