బాలకృష్ణ పై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సీరియస్ వ్యాఖ్యలు..!!
TeluguStop.com
వైసీపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు( YCP Minister Karumuri Nageshwara Rao ) టీడీపీ ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
నేడు బాలకృష్ణ కొత్త సినిమా "భగవంత్ కేసరి"( Bhagavanth Kesari ) విడుదల కావడం జరిగింది.
దీంతో చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో బాలకృష్ణ సినిమాలను ఎందుకు ఆపకుండా విడుదల చేశారు అని మంత్రి కారుమూరి ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీ క్యాడర్( TDP Cadre ) అంతా బాధలో ఉంటే బాలకృష్ణ తన సినిమాను ఎలా విడుదల చేశారని నిలదీశారు.
మరి అలాంటప్పుడు ప్రజలు ఎందుకు రోడ్లపైకి వచ్చేందుకు నిరసన తెలపాలని ప్రశ్నించారు.నిజంగా చంద్రబాబు అరెస్టు( Chandrababu Arrest ) అంత బాధ కలిగించి ఉంటే హెరిటేజ్ ను ఎందుకు ముయ్యలేదు చెప్పాలని డిమాండ్ చేశారు.
"""/"/
చంద్రబాబు కోసం హెరిటేజ్ ముయరు, బాలకృష్ణ( Balakrishna ) తన సినిమాని ఆపెయ్యరు.
కానీ ప్రజలు మాత్రం రోడ్లపైకి రావాలా అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో బీసీలకు జగన్ ప్రభుత్వం ఎన్నో మేలులను చేసిందని వివరించారు.చంద్రబాబు హయాంలో బీసీలను మోసం చేశారని ఆరోపించారు.
జగన్ హయాంలో స్కీములు ఉంటే చంద్రబాబు హయంలో స్కాములు జరిగాయని పేర్కొన్నారు.చంద్రబాబును ఆంధ్రాలో అరెస్టు చేస్తే హైదరాబాదు( Hyderabad )లో గొడవలు ఏమిటనీ ప్రశ్నించారు.
చట్టం ముందు అందరూ సమానమే అని అన్నారు.త్వరలో నిర్వహించబోయే బస్సు యాత్ర ద్వారా వైసీపీ ప్రభుత్వం వచ్చాక జరిగిన మంచిని ప్రజలకు వివరిస్తామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.
ఆ సినిమాను వదిలేసినందుకు ప్రభాస్ ఇప్పటికి బాధపడుతూ ఉంటాడా..?