జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో తెలంగాణ బీజేపీ నేతలు సమావేశం అయ్యారు.ఈ క్రమంలో బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ జనసేనానితో భేటీ అయ్యారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే జనసేన పార్టీ మద్ధతుతో ముందుకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఏపీలో బీజేపీ, జనసేన మధ్య స్నేహబంధం కొనసాగుతుంది.ఈ క్రమంలోనే పవన్ తో సమావేశం అయ్యారని సమాచారం.
ఇటు ఇప్పటికే తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేస్తామని జనసేన ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తాము పోటీ చేయనున్న స్థానాలను సైతం ప్రకటించింది.
అయితే తెలంగాణలోనూ జనసేన, బీజేపీ మధ్య స్నేహం కుదురుతుందా అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.తాజా పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.