అవును, మీరు విన్నది నిజమే.అదేంటి సోమరులకు ఎవరు పని ఇస్తారు అని అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.వారికోసం కూడా చాలా ప్రత్యేకమైన ఉద్యోగాలు వున్నాయి.ఆ జాబ్స్ మిగతా వాటికి పూర్తి భిన్నంగా వుంటాయి.మనలో దాదాపుగా అందరూ డబ్బు సంపాదన కోసమే పని చేస్తుంటారు.అందుకే ఇక్కడ చాలా మంది ఉద్యోగాలతో సంతోషంగా ఉండరు.
ఇక మరోరకం వుంటారు.వారు పని చేయాలంటే బ్రహ్మాండం బద్దలవ్వాల్సిందే.
అస్సలు వారికి ఈ విషయంలో వళ్ళు వంగదు.ఆ లిస్టులో మీరు వుంటే ఇక్కడ కొన్ని ఉద్యోగాల జాబితా వుంది అందులో ఏది ఉత్తమమైనదో చూసుకోండి.
ప్రొఫెసర్ ఫారినర్:ఈ లిస్టులో మొదటిది ప్రొఫెసర్ ఫారినర్.చైనీస్ కంపెనీలు( Chinese companies ) కొన్నిసార్లు చైనీస్ భాష తెలియని విదేశీయులను వారి అవసరాల నిమిత్తం ఇలాంటి వారిని నియమించుకుంటాయి.
అతనో సెలబ్రిటీ అన్నట్లుగా అక్కడ ప్రజెంట్ చేస్తారు.
ప్రొఫెషనల్ కడ్లర్:తరువాత చెప్పుకోదగ్గ పోస్ట్ ప్రొఫెషనల్ కడ్లర్( Professional cuddler ).ఇక్కడ మీరు చేయవలసింది ఒక్కటే.ఎవరైనా మంచం మీద పడుకోవడానికి ఒంటరిగా ఇబ్బంది పడితే, మీరు వారిని హత్తుకొని పడుకోవాలి అంతే.
ఒక కడ్లర్ గంటకు సుమారు $80 వసూలు చేస్తాడని వినికిడి.

హోటల్ స్లీప్ టెస్టర్:ఈ వుద్యోగంలో మీరు చేయవలసింది ఏమంటే, హోటల్ బెడ్ మీద పడుకుని తన కంఫర్ట్ లెవెల్ చెక్ చేసుకోవడం.అవును, మీరు విలాసవంతమైన హోటల్‌లో పడుకుని ఫీడ్‌బ్యాక్ ఇవ్వవలసి వుంటుంది.దానికోసం మంచి మొత్తంలో డబ్బు ఇస్తారు.

బీర్ టేస్టర్:ఈ జాబ్ మీలో చాలామందికి నచ్చుతుంది.ఇక్కడ మీరు బీర్ తాగి దాని టేస్ట్ ఎలా వుందో చెబితే సరిపోతుంది.దీనికోసం చాలా బ్రూవరీలు ప్రొఫెషనల్ బీర్ టేస్టర్‌లను నియమించుకుంటాయి.బీర్ టేస్టర్ యొక్క సగటు జీతం 37,000 డాలర్లు అంతే మీరు నమ్ముతారా?
.