ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు చాలామంది సాంగ్స్ వింటారు.తమకు ఇష్టమైన సాంగ్స్ వింటూ జర్నీ చేస్తూ ఉంటారు.
ఇక కొంతమంది ప్రయాణాల్లో సినిమాలు చేస్తూ తమ జర్నీని కొనసాగిస్తారు.ఇక కొంతమంది తమకు ఇష్టమైనవారితో మాట్లాడుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.
కుటుంబసభ్యులతో జర్నీ చేసేవారు తమ కుటుంబంతో సరదాగా గడుపుతారు.కానీ చాలామంది మ్యూజిక్ ప్రియులు( Music Lovers ) ఉంటారు.
వాళ్లు ఎక్కడికి ప్రయాణం చేసినా హెడ్ ఫోన్స్ వంటివి మర్చిపోకుండా తీసుకెళ్తూ ఉంటారు.
అయితే గిటార్ ను ( Guitar ) వాయించే కొంతమంది మ్యూజిక్ ప్రియులు ఉంటారు.కొంతమంది ఆసక్తితో గిటార్ వాయిస్తే.మరికొంతమంది కాలక్షేపం కోసం వాయిస్తూ ఉంటారు.
కానీ ప్రయాణాల్లో( Travelling ) గిటార్ ను తీసుకెళ్లకడం కుదరని పని.లగేజీలో ఇది పట్టదు.అలాగే పొడవాటి గిటార్ ను జాగ్రత్తగా బాక్స్ లో భద్రపరిచి తీసుకోవాల్సి ఉంటుంది.జర్నీలలో గిటార్ ధ్వంసమయ్యే అవకాశం ఉంటుంది.జాగ్రత్తలు తీసుకోకపోతే పగిలిపోయే అవకాశం ఉంటుంది.ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఓ కంపెనీ ప్రయాణాల్లో మడిచేసుకుని తీసుకెళ్లే గిటార్ ను తయారుచేసింది.
అమెరికన్ సంగీత పరికరాల తయారీ సంస్థ కియరీ గిటార్ అనే కంపెనీ ఈ గిటార్ ను ఆవిష్కరించింది.ఎసెండర్ పీ90 సోలో( Ascender P90 Solo ) పేరుతో మార్కెట్ లో ఈ తేలికపాటి గిటార్ ను లాంచ్ చేసింది.ఈ గిటార్ ధర 1599 డాలర్లుగా ఉంది.అంటే ఇండియన్ కరెన్సీలో 1.32 లక్షలు అన్నమాట.ప్రయాణాలకు వెళ్లేటప్పుడు దీనిని తేలికగా మడిచి ప్యాక్ చేసుకుని తీసుకెళ్లవచ్చు.
గిటార్ ను ఇష్టపడేవారికి ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.దీంతో దీని సేల్స్ కూడా పెరుగుతున్నాయి.
సులువుగా మడిచేసుకుని ఎక్కడికైనా సులువుగా ఈ గిటార్ ను తీసుకెళ్లవ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.మ్యూజిక్ ప్రియుల కోసం దీనిని తయారుచేసినట్లు చెబుతున్నారు.